అమ్మ కూతురైంది.. నాగార్జున ఆనందం రెట్టిపైంది.

తెరమీద ప్రేమికులుగా అలరించారు. గాఢమైన ముద్దులు పెట్టుకున్నారు. ఏ మాయ చేశావంటూ నాగచైతన్య.. సమంత చుట్టూ తిరిగారు. తెరలోనే కాదు.. బయట ఒకరినొకరు మనసులు కలుపుకొని ఒక్కటయ్యారు. ఏ మాయ చేశావే జోడి నాగచైతన్య, టాప్ హీరోయిన్ సమంతల నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కొంత మంది అతిథులు, దగ్గరి బంధువుల మధ్య ఈ వేడుక అంగరంగ వైభవంగా సాగింది.. క్రిస్టియన్, హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలో సమంత, నాగచైతన్యలు ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థంలో ఒక్కటయ్యారు.

ముందుగా నాగచైతన్య సమంతకు రింగ్ తొడిగి అప్యాయంగా ముద్దుపెట్టుకోగా.. సిగ్గులొలుకుతూ సమంత నాగచైతన్యకు రింగు తొడిగింది. ఈ వేడుకలో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ , ఆయన ఫీయాన్సీ శ్రియా భూపాల్ లు పాల్గొని వన్నె తెచ్చారు. ఇద్దరు కొడుకులు, కోడళ్లతో నాగార్జున, అమల లు దిగిన ఫొటోను ట్విట్టర్ పోస్ట్ చేసి నాగార్జున తన సంతోషాన్ని మాటల్లో చెప్పలేనంటూ రాసుకొచ్చారు.. ‘‘ నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా.. మా అమ్మ ఇప్పుడు కూతురైంది.. ఇంతకంటే సంతోషం ఇంకేంముంటుంది.’ అని సంబరపడ్డారు. అమ్మ అని నాగార్జున సంబోధించిన సమంత మనం సినిమాలో నాగార్జునకు తల్లిపాత్రలో నటించింది. (ఫ్లాష్ బ్యాక్ లో).. అందుకే అమ్మ కూతురైంది అని అప్యాయంగా ఉద్విగ్నతకు లోనయ్యారు నాగార్జున..

To Top

Send this to a friend