అన్నీ లోపలేసుడే.. ప్రజలకేం ఇస్తావ్ మోడీ..


‘దేశంలో ప్రజలను గ్యాస్ సబ్సిడీని వదులుకోమని చెప్పిన సాహసవంతున్ని రెండో ప్రధానిని నేనేనని ప్రధాని నరేంద్రమోడీ గొప్పగా చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ మేరకు బీరాలు పలికారు. తనకంటే ముందు 1960లో దేశంలో కరువు వచ్చినప్పుడు నాటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి సైతం ఇలాంటి సాహసమే చేశారని మోడీ గుర్తు చేశారు. అప్పుడు కరువుతో అల్లాడుతున్న దేశాన్ని శాస్త్రి అలా చెప్పి చక్కదిద్దాడు. కానీ నేడు సుసంపన్నంగా ఉన్న దేశంలో కూడా మోడీ గ్యాస్ సబ్సిడీని వదులుకోమనడం గమనార్హం. మోడీ పథకాలన్నీ ఏ ఒక్కటి విజయవంతం కాలేదు.. ఎంతసేపు సబ్సిడీలు వదులో.. నోట్లు బ్యాంకులో జమచేసుకో.. ఇలా అన్నింటిని లాగేసుకోవడమే.. తప్ప వాటినుంచి ప్రజలకు ఏదైనా మంచి పథకాలు, ప్రయోజనాలు అందించేందుకు ఒక్క పథకం కూడా పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్ని లోపలేసుకోవడం తప్పితే.. నోట్ల రద్దు తర్వాత ప్రధాని మోడీ సాధించింది ఏంటో ఒక్కటి చెప్పండి సగటు మానవుడు ప్రశ్నిస్తున్నాడు. నోట్ల రద్దు తర్వాత పేదల అకౌంట్లలో డబ్బులు జమచేస్తారని అనుకున్నారు. గృహనిర్మాణంలో తక్కువ కు ఇళ్లిస్తారన్నారు. అయినా ఏ ఒక్క హామీని మోడీ నెరవేర్చలేదు. మరి బ్యాంకుల్లో జమ చేసిన సొమ్మును మోడీని ఏం చేస్తున్నట్టో అర్థం కాని పరిస్థితి.. నోట్ల రద్దు వల్ల చాలా మంది వ్యాపారాలు, చిరు వ్యాపారులు, సామాన్య, మధ్యతరగతి జనం కుదేలయ్యారు. ఇప్పుడు ఎవ్వరి వద్ద డబ్బుల్లేని పరిస్థితి. చాలా దుకాణాలు సైతం మూతపడ్డాయి. ఇంత చేసి ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టిన ప్రధాని.. తన గొప్పలపై మాత్రం ఊదరగొడుతున్నారు. అందుకే యూపీ ప్రజలు ఈ ఎన్నికల్లో మోడీకి పట్టం కడుతారా…? నోట్లరద్దు పరిణామాలతో బండకేసి కొడుతారా వేచిచూడాల్సిందే..

To Top

Send this to a friend