అఖిలేష్ లో టన్నుల కొద్దీ భయం.. అందుకే ఆ నిర్ణయం

ఉత్తరప్రదేశ్.. దేశంలోని అతిపెద్ద రాష్ట్రం.. జనాభా పరంగా కూడా దేశంలోనే మొదటిది.. ఉత్తరప్రదేశ్ మొత్తం జనాభా.. అమెరికా జనాభాతో సమానం.. అంతలా పెద్దరాష్ట్రాన్ని ఏలుతున్న సీఎం అఖిలేష్.. అసాధారణ నిర్ణయం తీసుకున్నరు. ప్రస్తుతం సమాజ్ వాదీ అధ్యక్షుడిగా.. సీఎంగా కొనసాగుతున్న అఖిలేష్.. ఫిబ్రవరి, మార్చిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయనని ప్రకటించి సంచలనం సృష్టించాడు. యూపీ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో తాను అందరూ ఊహించనట్టు సరోజినినగర్ నుంచి బరిలోకి దిగడం లేదని.. ఆ స్థానంలో శార్దా ప్రతాప్ శుక్లాను బరిలో నిలిపినట్లు తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు..

ప్రస్తుతం అఖిలేష్ ఎమ్మెల్సీగా కొనసాగుతూ యూపీ సీఎంగా ఉన్నారు. ఇంత పెద్ద రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు ప్రచారం చేస్తే మిగతా రాష్ట్రమంతా కాన్సన్ ట్రేషన్ దెబ్బతింటుందని.. అందుకే తాను పోటీ చేయకుండా ప్రచారం మాత్రమే చేస్తానని అఖిలేష్ స్పష్టం చేశారు. అఖిలేష్ ఎమ్మెల్సీ పదవి కాలం 2018 వరకు ఉంది. ఈ ఎన్నికల్లో పార్టీని నడిపించి ఆ పదవి కాలం పూర్తయ్యాక వెనుకబడిన బుందేల్ ఖండ్ నుంచి ఎమ్మెల్యే గా బరిలో నిలుస్తానని అఖిలేష్ స్పష్టం చేశారు. అక్కడ అభివృద్ది కోసం బలమైన నాయకుడి కోసం ప్రజలు వెతుకుతున్నారని.. తాను ఇప్పుడు పార్టీ తరఫున ప్రచారం చేసి 2018లో బుందేల్ ఖండ్ నుంచి పోటీచేసి గెలుస్తానని చెప్పారు..

కాగా అఖిలేష్ నిర్ణయం తో బీజేపీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ విమర్శలు గుప్పించాయి. అఖిలేష్ పై యూపీలో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఓటమి ఖాయం అని తెలిసే.. సరోజిని నగర్ నుంచి బరిలోకి దిగడం లేదని ఆరోపించాయి. అఖిలేష్ కు ఈ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఇలా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.

To Top

Send this to a friend