అఖిలేష్ కూటమి ప్లాన్.. బీజేపీకి మూడినట్టే?

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తండ్రి విభేదాలను చాకచక్యంగా పరిష్కరించుకొని ములాయంను వేరుకుంపటి పెట్టుకోనీయకుండా నిరోధించడంలో సీఎం అఖిలేష్ విజయం సాధించారు. దాంతో పాటు సమాజ్ వాదీ పార్టీ నాయకత్వాన్ని , ఆ పార్టీ సైకిల్ గుర్తును చేజిక్కించుకున్నారు.. పార్టీ, నాయకత్వ సమస్యలను పరిష్కరించుకున్న అఖిలేష్.. ఇప్పుడు బీజేపీ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు..

అఖిలేష్ నేతృత్వంలో ఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీలు కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీని ఓడించడమే ధ్యేయంగా అఖిలేష్ వేసిన మాస్టర్ ప్లాన్ కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, ఆర్ఎల్ డీ అధినేత అజిత్ సింగ్ సై అన్నారు. బీజేపీ ఓటమి కోసం కాంగ్రెస్, ఆర్ఎల్డీల కు పట్టు అంతగా లేకపోయినా అఖిలేష్ ఆ పార్టీలను కలుపుకొని ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ కు 83, ఆర్ఎల్డీకి ఓ 15 సీట్లు ఇఛ్చేందుకు అంగీకరించారు. తొలిదశ ఎన్నికలు జరిగే పశ్చిమ యూపీలో జాట్ ల ప్రభావం ఎక్కువ. అక్కడ అదే సామాజిక వర్గమైన ఆర్ఎల్డీ పార్టీకి పట్టు ఉంది. అందుకే ఆర్ఎల్డీని కలుపుకొని అఖిలేష్ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో కుదేలయిన కాంగ్రెస్ పార్టీ కి కూడా కొన్ని సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ సంప్రదాయం వస్తున్న ముస్లిం ఓటు బ్యాంకును చేజిక్కించుకునేందుకే అఖిలేష్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. యూపీలో ముస్లింలు 18శాతం ఉండడంతో ఎలాగైనా కూటమికి ఓట్లు పడేలా అఖిలేష్ జాగ్రత్త పడ్డాడు. ఎలాగూ ముస్లిం ఓట్లు బీజేపీకి పడవు కనుక అఖిలేష్ వ్యూహం పారినట్టే..

పైగా నోట్ల రద్దు ప్రభావం దేశంలో తీవ్రంగా ఉంది. చిరు, మద్య తరగతి వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దాంతో అది బీజేపీపై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ.. ఇది కూడా బీజేపీకి శరాఘాతంగా మారింది. ఇలా అఖిలేష్ కూటమి దెబ్బ ఇప్పుడు ప్రధాని మోడీని కలవరపరుస్తోంది. బీహార్ లో నితీష్-లాలూ కలిసి బీజేపీని ఓడించినట్టే ఇక్కడా పునారావృతం అవుతుందా అన్నది బీజేపీ అధినాయకులను వెంటాడుతోంది.. మోడీ ఎంత హావా నడిచిన ఇప్పుడు అఖిలేష్ ప్లాన్ కు దెబ్బై పోయేలానే ఉన్నాడు.. సో యూపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు సీఎం అఖిలేష్ కు కలిసివచ్చేలా.. మోడీకి శరాఘాతంలా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు

To Top

Send this to a friend