ఎంటర్ ది డ్రాగన్..


దేశవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లోని వైఎస్సాసీపీ కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వైసీపీ నాయకులతో భేటి అయ్యారు. ఈ భేటిలో వైసీపీలోని కీలక నేతలందరూ పాల్గొన్నారు. ఇందులో ప్రశాంత్ వైసీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం.

ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించడమే ధ్యేయంగా ప్రశాంత్ కిషోర్ పలు సలహాలు, సూచనలను వైసీపీ నాయకులకు ఇచ్చినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు ను తెలుసుకొని ఎవరు గెలుస్తారో గెలవరో నిర్ణయించి రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు. ఇందుకోసం తర్వలోనే ఏపీ వ్యాప్తంగా పర్యటించి సర్వే చేసి నివేదిక తయారు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. .

జగన్ ను వచ్చేసారి ఏపీ సీఎంను చేయాలనే పట్టుదలతో ప్రశాంత్ కిషోర్ ప్లాన్లు రెడీ చేస్తున్నట్టు సమాచారం. అందుకోసమే తొలిసారి హైదరాబాద్ వచ్చి వైసీపీ నేతలతో చర్చించారు. ఎన్నికలకు రెండేళ్లు ఉండడంతో ఇక ఆయన బృందం ఏపీలో రాజకీయ సమాజిక సమీకరణాలు, విశ్లేషణలు చేసి రాజకీయ వ్యూహాలు రూపొందించి జగన్ తో అమలు చేయిస్తారు. తద్వారా జగన్ ను అధికారంలోకి తేవాలని ప్లాన్ చేశారు. కాగా జగన్ 200 కోట్లకు పైగా పోసి ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల పరిశీలకుడిగా తెచ్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

To Top

Send this to a friend