ముల్లును ముల్లుతోనే తీయాలని..

వైసీపీ అధినేత జగన్ హైటెక్ ప్లాన్ చేశారు. తన పార్టీలోని ముఖ్య నేతలందరికీ శాటిలైట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీ తరఫున ఈ ఫోన్లను ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలిసింది. ఈ శాటిలైట్ ఫోన్ల ద్వారా రెండు ఉపయోగాలున్నాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందులో ఒకటి.. 1. చంద్రబాబు సర్కారు .. వైసీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసే అవకాశాలు ఉండవు.. రెండోది. 2. వైసీపీ నేతలు ఎక్కుడున్నా.. ఏ పరిస్థితుల్లో ఉన్న వెంటనే సమాచారం రాబట్టుకోవచ్చు.. టెలికాం ఆపరేటర్లలాగా సిగ్నల్స్ సమస్య ఉండదు.. అందుకే జగన్ ఇలా డిసైడ్ చేసిండు..

ఈ ఐడియా జగన్ కు రోజాను చూశాకా వచ్చిందట.. వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబు సర్కారు ఆర్భాటంగా చేసిన మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు వస్తే ఆమెను అరెస్ట్ చేసి పోలీసులు ఎక్కడెక్కడో తిప్పి హింసించి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గరి నుంచి రోజా తన స్మార్ట్ ఫోన్ తో వీడియో రికార్డు చేసి ఇంటర్ నెట్ ద్వారా తనకు జరుగుతున్న అన్యాయాన్ని టీవీ చానల్స్ కు పంపింది. ఇది లైవ్ టెలికాస్ట్ లా చానల్స్ లో హోరెత్తింది. ఈ అన్యాయంపై ఆరోజు తెలుగు మీడియాలో హోరెత్తి సంచలనమైంది. ఈ టెక్నాలజీ అద్భుతాన్ని క్యాష్ చేసుకోవాలని.. రోజా ఇచ్చిన ఈ ఐడియాను బేస్ చేసుకొనే జగన్ శాటిలైట్ పోన్లను అందరికీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట.. అంతేకాదు.. రోజా ఇలా వీడియో తీసి ఆరోజు పార్లమెంటేరియన్ సదస్సు కంటే కూడా వివాదం తో ఎక్కువ ప్రాచర్యం పొందారు. ఈ విషయంలో రోజాను అభినందించిన జగన్.. ఇప్పుడు ఈ శాటిలైట్ ఫోన్ల ఐడియాకు తెరతీశారు. హైటెక్ సీఎం చంద్రబాబును హైటెక్ ఐడియాతోనే కొట్టాలని జగన్ చేసిన ఈ ఐడియా అధికార టీడీపీకి కొంచెం ఇబ్బందికరమే మరి..

To Top

Send this to a friend