టంగ్ స్లిప్ అయిన జగన్

జగన్ టంగ్ స్లిప్ అయ్యారు. గరిగపర్రులో ఇటీవల దళితులు, అగ్రవర్ణాల మధ్య గొడవలు జరిగి సామాజిక బహిష్కరణకు దారితీసిన విషయం తెలిసిందే.. ఆ గ్రామంలో పర్యటించిన జగన్ అక్కడి వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. అందరితో మాట్లాడి గొడవ సద్ధుమణిగేలా చేశారు.. కానీ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ ఠంగ్ స్లిప్ అయ్యి ఇరుక్కుపోయారు.

జగన్ నిందుతుల్ని అనబోయి.. బాధితులంటూ మాట తూలారు.. విలేకరులతో మాట్లాడుతూ.. ‘గరిగపర్రులో దళితులు, అగ్రవర్ణాల మధ్య గొడవలో బాధితుల్ని ముందే అరెస్ట్ చేస్తే ఈ గొడవ లేకపోయేది కదా..’ అని మాట తూలారు. నిజానికి జగన్ చెప్పాల్సింది.. బాధితుల్ని కాదు.. నిందితుల్ని.. ఈ విషయంలో ఒక పదం వేరే అనడంతో మీడియా విలేకరులు అవాక్కయ్యారు..

ఇక లోకేష్ బాబు మాట తూలితే ఓ రేంజ్ లో ఆడుకున్న వైసీపీ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూ టీడీపీ సానుభూతి పరులు జగన్ అన్న ఈ డైలాగును పట్టుకొని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడిపోసుకుంటున్నారు. జగన్ నిందుతుల్ని కాకుండా.. బాధుతుల్ని అరెస్ట్ చేయమని అన్నాడని సెటైర్లు వేస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

జగన్ తూలిన మాట వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend