వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. మరో రెండేళ్లే సమయం ఉండడంతో ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు.. గెలుపు గుర్రాలుగా ఉండే అభ్యర్థుల కోసం వైఎస్ జగన్ రహస్య సర్వే చేస్తున్నట్టు తెలిసింది. సాక్షి విలేకరుల సౌజన్యంతో కొంతమంది యువకులతో మంచి టీం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహిస్తున్నాడట..
గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, నియోజకవర్గాల సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తున్న వారిని తిరిగి అభ్యర్థులుగా ప్రకటిస్తే రానున్న ఎన్నికలలో వారి విజయావకాశాలు ఏ విధంగా ఉంటాయనే అంశంపై వైసీపీ అంతర్గత సర్వే చేయిస్తోంది. వారినే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులలో ఎవరికైనా పార్టీ టికెట్ ఇస్తే ఎవరు గెలుస్తారనే దానిపైన కూడా జగన్ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
ఈసారి గెలుపు వైసీపీకి, జగన్ కు అత్యవసరం.. వైసీపీలో గెలుపు గుర్రాలు ఎవరో జగన్ వారికే టికెట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. పార్టీ బలాబలాలు, అభ్యర్థుల విజయావకాశాలు సర్వే ద్వారా అంచనావేసి వారికే టికెట్లు ఇవ్వడానికి జగన్ రెడీ అయిపోతున్నాడట.. ఇలా వచ్చేసారి గెలుపు కోసం జగన్ సర్వే చేసి పకడ్బందీగా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
