అధికారం కోసం జగన్ భారీ స్టెప్..

ఇడుపుల పాయలో నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి మొక్కిన జగన్ అనంతరం గన్నవరం ఎయిర్ పోర్టులో దిగి గుంటూరులో వైఎస్ జయంతి సందర్భంగా రెండు రోజుల పాటు నిర్వహించే వైసీపీ జాతీయ ప్లీనరీలో ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ జిల్లాల నుంచి వచ్చిన ఆయా జిల్లాల వైసీపీ నేతలు పలు తీర్మాణాలను ప్రవేశపెట్టారు. మొత్తం 18 తీర్మాణాలు ఆమోదించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో దానికి సంబంధించిన ప్రణాళికలను చర్చించారు.

అయితే ఈ ప్లీనరీలోనే జగన్ ఏపీ రాజకీయాల్లో సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ఏడాది ముందు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది.

జగన్ పాదయాత్ర ఎప్పుడు , ఎక్కడ మొదలు పెట్టేది ఈ ప్లీనరీలోనే డిసైడ్ చేసే చాన్స్ ఉంది. ఈ పాటికే జగన్ పాదయాత్రకు సంబంధించి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. అందుకే ఈ ప్లీనరీలోనే జగన్ తన పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నిన్నటి చంద్రబాబు వరకు పాదయాత్ర చేసే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఏపీ రాజకీయాల్లో పాదయాత్ర అంత పవర్ ఫుల్ రాజకీయ ప్రచారం ఇంకోటి లేదు. అందుకే బ్రహ్మాస్త్రంలాంటి పాదయాత్ర అస్త్రాన్ని జగన్ తీసి అధికార టీడీపీ ని , చంద్రబాబును ఓడించాలని పట్టుదలతో ఉన్నాడు. దీనికి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు తోడవడంతో జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆశావాహంగా ఉన్నారు.

To Top

Send this to a friend