యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘బిగ్‌బాస్‌’ లుక్‌ అదుర్స్‌


యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ మాటీవీలో ప్రసారం కాబోతున్న ‘బిగ్‌బాస్‌’ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా బిగ్‌ బాస్‌ షో గురించి మీడియాలో తారా స్థాయిలో ప్రచారం జరుగుతుంది. అయితే నందమూరి ఫ్యాన్స్‌కు మాత్రం ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ షో చేస్తున్నాడంటే నమ్మకం కలగలేదు. హిందీలో పలువురు స్టార్‌ హీరోలు హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షోను తెలుగులో చేస్తున్నారనే వార్త రాగానే అంచనాలు భారీగా వచ్చాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తాజాగా విడుదలైన పోస్టర్‌ ఉంది.

హిందీలో పాపులర్‌ అయిన బిగ్‌బాస్‌ షోను అదే పేరుతో తెలుగులో కూడా తీసుకు వస్తున్నారు. ఎన్టీఆర్‌తో ఫొటో షూట్‌ నిర్వహించి బిగ్‌బాస్‌ షో ప్రచారం మొదలు పెట్టారు. త్వరలోనే కార్యక్రమంను ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. మాటీవీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ కార్యక్రమంపై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ క్రేజ్‌ ఉంది. ఈ కార్యక్రమంతో మాటీవీకి కనీవిని ఎరుగని రీతిలో టీఆర్‌పీ రేటింగ్‌ రావడం ఖాయం అంటూ బుల్లి తెర వర్గాల వారు చెబుతున్నారు.

ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. ఆ సినిమాను ఆగస్టులో పూర్తి చేయనున్నాడు. అదే ఆగస్టులో బిగ్‌బాస్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వెండి తెరపై పలు సార్లు తన నట విశ్వరూపం చూపించిన ఎన్టీఆర్‌ బుల్లి తెరపై ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

To Top

Send this to a friend