ఎమ్మెల్యే నచ్చలేదా.? అయితే ప్రజలే దించేయవచ్చు..

 

తమ గ్రామ సమస్యలు తీరుస్తాడని కొందరు.. పట్టణాన్ని అభివృద్ది చేస్తాడని కొందరు.. ఇలా ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోతే.. హైదరాబాద్ లోనే ఉండిపోతే ఎలా.. పనులు చేయించుకునేది.? ఎప్పుడో ఓసారి  నియోజకవర్గానికి వెళ్లి అలా కనిపించి వస్తే ఎమ్మెల్యే పని అయిపోతుంది. కానీ ప్రజల కష్టాలు తీరవు…. మళ్లీ జనంతో అవసరం వచ్చేది ఐదేళ్లకు కదా.. అప్పుడు చూసుకోవచ్చు అని అందరూ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తారు.  నియోజకవర్గం అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులకు త్వరలోనే షాక్ తగలనుందా.. రీకాల్ ఆఫ్షన్ దిశగా కేంద్రం ఆలోచిస్తుందా.. ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
 
 
మీరు ఓట్లేసిన గెలిపించిన ఎమ్మెలేలు సరిగా పని చేయకపోతే.. వారిని రీకాల్ చేసే అధికారం ఓటేసిన ప్రజలకు ఉండాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అంటున్నారు. దీనిపై లోక్ సభలో ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. నియోజకవర్గాల్లో పనిచేయని  ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ఓటర్లకే ఇవ్వాలనేది ఆయన డిమాండ్. ఇందులో భాగంగానే.. పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ 1951 చట్టానికి 2016లో పార్లమెంట్ సభ్యులు  సవరణలు ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం రైట్ టు రీకాల్ ను ఓ ప్రైవేట్ బిల్ గా పెట్టబోతున్నట్టు ప్రకటించారు.
 
 

రీకాల్ ఎలా చేస్తారంటే :
ఈ బిల్ చట్టంగా మారితే.. సంబంధిత ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఓటరుగా నమోదైన వ్యక్తి.. డైరెక్టుగా స్పీకర్ కు పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టాలని ఎలక్షన్ కమిషన్ కు సూచిస్తారు స్పీకర్. విచారణలో పిటీషన్ వ్యక్తి చెప్పిన విషయాలు వాస్తవం అని నిర్ధారణ అయితే.. EC సంబంధిత MLAపై రీకాల్ ఓటింగ్ నిర్వహిస్తుంది. అందులో 75 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేస్తే.. అతని పదవి ఊడిపోవడం గ్యారంటీ. ఈ బిల్ సామాన్యుడికి దక్కనున్న బ్రాహ్మాస్త్రం అంటున్నారు నిపుణులు. రైట్ టు రీకాల్ బిల్ చట్టం అయితే.. ఎన్నికైన MLA రెండేళ్లలోపే పదవి కోల్పోయినా ఆశ్చర్యం లేదు. అందలం ఎక్కించిన ఓటరు.. అగాథంలోకి నెట్టే అధికారం కూడా ఇస్తారా.. లేదో చూడాలి..

To Top

Send this to a friend