ఎవరి కొడుకో తేల్చేశారు..


రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్ ఎవరి కుమారుడో కోర్టు తీర్పు చెప్పింది. చాలా రోజులుగా రసాభాసగా మారిన ఈ వ్యవహారం మీడియాలో ఎంతో వివాదాస్పదమైంది. దక్షిణ తమిళనాడుకు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు ధనుష్ తమ కొడుకేనని.. చిన్నప్పుడే ఇంట్లోనుంచి పారిపోయాడని కోర్టులో ఫిర్యాదు చేశారు. ధనుష్ మాత్రం తాను వాళ్ల కొడుకు కాదని కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో ధనుష్ ఎవరి కుమారుడోనన్న ఉత్కంఠ కోర్టులో.. మీడియాలో హైలెట్ అయ్యింది.

హీరో ధనుష్ తమ కొడుకేనని కొద్దిరోజులుగా న్యాయపోరాటం చేస్తున్న మేలూర్ కు చెందిన వృద్ధ దంపతుల కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తుది తీర్పును వెలువరించింది. ఈ కేసునుంచి హీరో ధనుష్ కు విముక్తి లభించింది. హీరో ధనుష్ 1983లో జూలై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మీ దంపతులకు జన్మించాడని ధనుష్ ఆధారాలు చూపించారు. ఇవన్నీ పక్కాగా ఉండడంతో ధనుష్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు కేసును కొట్టివేసింది..

అయితే ధనుష్ పుట్టమచ్చలు తొలిగించుకున్నారని వృద్ధ దంపుతులు కోర్టుకు విన్నవించారు. వీటిని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఆధారాలు సరిగ్గా చూపలేదని.. కేవలం పుట్టుమచ్చలతో కేసును బలపరచలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

To Top

Send this to a friend