ఎవరయ్యా ఈ రాజమౌళి

కలలు కంటే నిద్రలో కనాలి..లేదా పగటి పూట కనాలి.. కానీ వెండి తెర వెలిగిపోయేలా ఎవడు కనమన్నాడు?
రాజాప్రసాదాలు ఇంత గొప్పగా ఎవడు నిర్మించమన్నాడు?
జలపాతాలకు అన్ని హొయలు ఎవడు నేర్పమన్నాడు..
పూలకు కొత్త రంగులు ఎవడు అద్దమన్నాడు?
పాత్రలను ఎవడు అంతలా తీర్చిదిద్దామన్నాడు?
ఒళ్ళు గగురుపొడిచే యుద్దాలు…
రోమాలు నిక్క పొడిచే పోరాటాలు..
కళ్ళు చెమర్చే హృద్యమైన సన్నివేశాలు..
తెలుగు ఖ్యాతిని నలుచెరుగులా ఎవడు విస్తరించమన్నాడు?
ఒక్క బేతాళ ప్రశ్నను సంధించి దేశం యావత్తును కుతుహు లం లో ఎవడు పడేయమన్నాడు?
ఏం సినిమా.. ఏం విజువల్ ఎఫెక్ట్స్ ..
2 గంటల 50 నిమిషాలు ఒక్క క్షణములా గడిచి పోయాయి.. ఎక్కడా రెప్ప వాల్చనీయకుండా చేశాయి..
తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయి దాటిందని వివరించాలా?
మూస కథలతో కాలక్షేపం చేస్తారు అనే వారికి చెంప పెట్టులాంటి సినిమా అని రొమ్ము విరిచి చెప్పాలా?
మహిశ్మతి అంటే అర్థం నాకు తెలీదు..
కానీ ఓ రాజ్యం ఇంత గొప్పగా ఉంటుందా?
ఊహ కూడా ఊహించనంత అందంగా ఉంటుందా?
అనగానగా ఓ రాజు అతడికి ఏడుగురు కొడుకులు
అని చదువుకున్న నాకు..
ఓ పాలకుడు ప్రజల కోసం ఇంతలా పాకులాడుతాడా?
వారి ధన,మాన, ప్రాణాలకు కాపాలదారుడిగా ఉంటాడా ?
ఎంత బాగా వివరించావు దర్శకోత్తమా..
ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్.. ఓ సైన్యాధ్యక్షుడిని రాజును చేశావ్.. హీరో ఇజాన్ని కించిత్ కూడా తగ్గించలేదు..
ప్రతి నాయకుణ్ణి ఎక్కడా తక్కువ చేయలేదు..
అసలు ఈ సినిమాలో నువ్వు చేయని అద్భుతం లేదు..
కపటత్వానికి భల్లాలుడ్ని, రాజసానికి అమరేంద్ర బాహుబలిని, క్షత్రియ ధర్మానికి శివగామిని, కుటీలత్వానికి బిజ్జలదేవుణ్ణి, కట్టుకున్న భర్తను అమితంగా ప్రేమించే దేవసేనను, పోరాట యోధత్వానికి శివుణ్ణి, దైర్యత్వానికి అవంతికను.. విశ్వాసానికి కట్టప్పను.. ఒక్కో పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశావు..
వెండి తెరను నీ కలలను ముద్రించేందుకు వాడావు..
మా మనసులో చెరగని ముద్ర వేశావు..
సాహో అంటే అర్థం నాకు తెలీదు.. ఒకవేళ అది గొప్ప అనే పదానికి నానార్థం అయితే.. అది చాలా తక్కువ.. ఇంకా వర్ణించాలని ఉంది.. పదాలు జ్ఞప్తికి రావట్లేదు.. తెలుగుయేతరులు ఇక నుంచి తెలుగు సినిమా అంటే ₹1500 కోట్ల సినిమా అని చెప్పక తప్పని పరిస్థితి తీసుకొచ్చావ్..
అందరి ముందు ఇదీ తెలుగు సినిమా అని సగర్వంగా చాటావ్..
సాహో బాహుబలి.. సాహో జక్కన్న..

To Top

Send this to a friend