ఎన్నికల కోసం 150 కోట్లు..


కాటమరాయుడు మూవీని ఆరునెలల్లోనే పూర్తి చేసి పవన్ రికార్డు కొట్టాడు. అత్తారింటికి దారేది తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తీసి ప్లాపు కొనితెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కాటమరాయుడు సినిమా ఘనవిజయం సొంతం చేసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు.

కాటమరాయుడు సినిమా తర్వాత వరుసగా సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆయా సినిమాల ద్వారా పవన్ దాదాపు ఇప్పటికే రూ. 150 కోట్లు అడ్వాన్సుగా తీసుకున్నాడని సమాచారం. ఈ మొత్తాన్ని వచ్చే 2019 ఎన్నికల్లో ఖర్చు చేయాలని డిసైడ్ అయినట్టు టాక్.

కాగా పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ అయినా పవన్ కు వాటాగా రూ.25 కోట్ల దాకా ఆదాయం వచ్చింది. తాజాగా కాటమరాయుడు సినిమాకు కూడా అదే రేంజ్ లో పారితోషికం అందుకున్నాడని ఫిలింనగర్ టాక్. ఇక రాబోయే సినిమా త్రివిక్రమ్ తో తీస్తున్నాడు. ఇందుకోసం ఇప్పటికే ఆ సినిమా నిర్మాతలు హారిక, హాసిని క్రియేషన్స్ నిర్మాతలు పవన్ కు 20 కోట్లు అడ్వాన్సుగా చెల్లించినట్టు టాక్. ఇక తమిళ డైరెక్టర్ నీశన్ దర్శకత్వంలో, మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ రెండు సినిమాలకు రూ.20 నుంచి రూ.25 కోట్లు అడ్వాన్సుగా తీసుకున్నట్టు తెలిసింది. బండ్ల గణేష్ తో సినిమా కు ఓకే చెప్పాడు. ఇలా మొత్తం చూస్తే దాదాపు 150 కోట్లను వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేసి ఏపీ ఎన్నికల్లో నెగ్గాలన్నది పవన్ ప్లాన్ అని తెలిసింది.

To Top

Send this to a friend