ఎట్టకేలకు జియోకు చెక్


ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ ఇలా దేశ టెలికాం రంగంలో దిగ్గజాలన్నీ జియోపై ఎన్నో ఫిర్యాదులు చేశాయి. కానీ వీటన్నింటిని ట్రాయ్ తోసిపుచ్చింది. ముఖేష్ అంబానీ లాబీయింగో.. లేదా మోడీ-అంబానీ అనుబంధమో ఏమో కానీ జియో లాంచ్ నుంచి ఇప్పటివరకు జియో ప్రకటించిన ఉచిత తాయిలాలు.. టెలికాం రంగంలో ఆ కంపెనీకి విశేష ఆదరణను కల్పించాయి. కానీ ఇప్పటికి కానీ ప్రత్యర్థి టెలికాం కంపెనీల ఆశలు నెరవేరలేదు..

జియో తమ ప్రైమ్ కస్టమర్లను రూ.99తో రీజార్ట్ చేసుకుంటే సంవత్సరం పాటు ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్ ఇస్తామని ప్రకటించింది. అంతటితో ఆగకుండా రూ.303 ఆ పైన రీచార్ట్ చేసుకుంటే మరో మూడు నెలలు అన్నీ ఫ్రీ అన్నది. ఈ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. కానీ దీనిపై ప్రత్యర్థి ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు ట్రాయ్ కు ఫిర్యాదు చేశాయి.

జియో కంపెనీ ప్రారంభమైనప్పటినుంచి సపోర్టుగా నిలిచిన ట్రాయ్ మొదటిసారి జియోకు షాక్ ఇచ్చింది. వెంటనే 303 ఆపైన రీచార్ట్ చేసుకునే కస్టమర్లకు ఫ్రీ ఆఫర్ ను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆదేశించింది. దీనికి జియో చైర్మన్ ముఖేష్ అంబానీ కూడా సరేనని.. రెండు రోజుల్లో ఈ ఆఫర్ ను ఎత్తివేయనున్నట్టు తెలిపారు. కాగా ఇప్పటివరకు 303తో రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రం ఈ ఉచిత ఆఫర్ కొనసాగుతుందని చెప్పడం కొసమెరుపు..

To Top

Send this to a friend