వైసీపీకి దగ్గరగా.. టీడీపీకి దూరంగా..


పవన్ తన స్ట్రాటజీని మెల్లమెల్లగా రిలీవ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటులో చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు, టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గైర్హాజరయ్యారు. దీనిపై ఫైర్ అయిన పవన్ ఈ సందర్భంగా టీడీపీ ప్రత్యేక హోదాపై రాజీపడుతోందని.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతోందన్నారు. ఏపీ ప్రజల ఓట్లతో టీడీపీ-బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు.

పవన్ వ్యాఖ్యలు టీడీపీపై వ్యతిరేకతను వెల్లడించాయి. అదే సమయంలో ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంటులో వైసీపీ ఎంపీలు పోరాడిన తీరును పవన్ ప్రశంసించారు. వైసీపీ విజయసాయి రెడ్డి చాలా బాగా ప్రశ్నించారని కీర్తించారు. ఈపరిణామాలు పవన్ వైసీపీకి దగ్గరగా అడుగులు వేస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

2019 ఎన్నికలు ప్రతిపక్ష నేత జగన్ కు, జనసేన అధినేత పవన్ కు అత్యంత కీలకం.. ఈ ఎన్నికల్లో జనసేన తరఫున పవన్ ఒంటరిగా బరిలోకి దిగేది అనుమానమే.. ఎందుకంటే సరైన క్యాడర్, నాయకులు లేని పవన్ ఈసారి కూడా ఏదో పార్టీకి మద్దతివ్వాల్సిందే.. ఇలాంటి పరిస్థితుల్లో హోదాపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీలను ప్రశంసించడంతో రాజకీయంగా పెను మార్పులు సంభవించడానికి దోహదపడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ.. రాబోయే ఎన్నికల్లో గనుక పవన్ -జగన్ కలిసి పోటీచేస్తే.. విజయం ఖాయమని పొలిటికల్ సర్కిల్ లో అందరూ భావిస్తున్నారు.

To Top

Send this to a friend