జనసేనలోకి రోజా..

దుందుడుకు స్వభావంతో పార్టీకి నష్టం తెస్తున్న ఎమ్మెల్యే రోజాకు ఇటీవలే జగన్ క్లాస్ పీకారన్న కథనాలు వెలువడుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆమె జగన్ నిర్వహించిన ‘సేవ్ విశాఖ’ సభకు హాజరుకాలేదని పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీలో తనను కొందరు నాయకులు ఎదగనీయడం లేదని నిర్ధారణకు వచ్చిన రోజా ఆ పార్టీకి దూరం కావాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

జబర్దస్త్ ప్రోగ్రాంలో తనతో కలిసి జడ్జిగా చేసే నాగబాబుతో రోజాకు సాన్నిహిత్యం ఉంది. అందుకే నాగబాబు ద్వారా పవన్ తో రాయబారం నడిపినట్టు సమాచారం. త్వరలోనే రోజా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. దీనికి పవన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. త్వరలోనే ఆమె వైసీపీని వీడి జనసేనలో వెళ్లబోతున్నారని రాజకీయవర్గాల్లో విస్తృతంగా వార్తలు వినిపిస్తున్నాయి.

* ఉన్న కొమ్మలను నరుక్కుంటున్న జగన్..
వైసీపీలో అసలు సీనియర్ నాయకులే లేరు. ఉన్న రోజాలాంటి ఫైర్ బ్రాండ్ లను కూడా జగన్ దూరం పెడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంతో మంది వైసీపీలో చేరుదామన్న జగన్ ఒప్పుకోవడం లేదు. తనను డామినేట్ చేసేవారిని జగన్ పార్టీలో ఉంచుకోడనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. స్వయంగా జగన్ తండ్రికి ఆప్తమిత్రుడు , ఆత్మ అయిన కేవీపీని సైతం జగన్ దూరం పెట్టడాన్ని దీనికి ఉదాహరణగా వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్లైన ఉండవల్లి, కాంగ్రెస్ మాజీ ఎంపీలను అందుకే చేర్చుకోలేదు. వైసీపీలో అంతా జగనే.. ఆయన నామస్మరణే ఉండాలి. కానీ ఎక్కడినుంచో వచ్చిన రోజా ఫైర్ బ్రాండ్ గా మారింది. పదునైన విమర్శలతో టీడీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చెప్పుడు మాటలు విని రోజాను దూరం పెడుతున్న జగన్..ఒక మంచి లీడర్ ను కోల్పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్న కొమ్మలను నరుక్కుంటున్న జగన్ ఎప్పటికోనాటికి పడిపోవడం ఖాయం అంటున్నారు.

అధికారం చేజిక్కాలంటే అందరిని కలుపుకోవాలి.. జగన్ లో ఆ గుణం లేదు. నాయకులను కలుపుకొని పోడు. మంచి నాయకులు దూరమైతే అది వైసీపీకి దెబ్బే.. ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న రోజాను చేజార్చుకోవడం నిజంగా వైసీపీకి పెద్ద దెబ్బ అంటున్నారు విశ్లేషకులు.

To Top

Send this to a friend