వైసీపీ ఎన్ డీ ఏ లో చేరితే ….

వైసీపీ బీజేపీ నాయకత్వం లోని
ఎన్ డి ఏ లో చేరి కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామి గా చేరాలి అనుకుంటుందనే సమాచారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

🔯కేంద్ర ప్రభుత్వం లో వైసీపీ చేరడం ద్వారా జగన్మోహన్ రెడ్డి , విజయసాయిరెడ్డి లపై ఉన్న సీబీఐ,ఎన్ ఫోర్స్మెంట్ కేసుల విచారణ పై ప్రభావం చూపించవచ్చు.

🔯ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు పై ఉన్న కేసుల్లో విచారణ, టీడీపీ హయాంలో జరిగిన అవినీతి పై కేంద్ర ప్రభుత్వం తో వైసీపీ ప్రభుత్వం మరింత సమన్వయం తో పనిచేయవచ్చు.

🔯సుజనా చౌదరి కేంద్రమంత్రి గా ఉన్నప్పుడు పలు ఆర్ధిక నేరాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు పలు తీవ్రమైన ఆర్ధిక నేరాలలోA2 గా ఉన్న విజయసాయి రెడ్డిని కేంద్ర మంత్రి గా అవకాశం ఇస్తారా ?

🔯అన్నింటికి మించి జనసేన పార్టీకి ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వైసీపీ విధానాలని విమర్శించడానికి బీజేపీ అనుమతిస్తుందా ? లేక పొమ్మన కుండా పొగపెట్టే పరిస్థితి వస్తుందా ?

🔯రాష్ట్రంలో ఉన్న వైసీపీలో ఉన్న ముస్లిం నాయకుల పరిస్థితి, ఉప ముఖ్యమంత్రి గా ఉన్న అంజాద్ భాషా గారి లాంటి వారికి సమర్ధించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
సీబీఐ కేసుల్లో 8 సంవత్సరాల తరువాత కూడా రోజువారీ విచారణ కి రాని పరిస్థితి పై ,న్యాయ వ్యవస్థ పై ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు.
ఆలాంటి పరిస్థితి వస్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతాయి.

🔯ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు విడుదల చేయని పరిస్థితి లో టీడీపీ కేంద్రం ప్రభుత్వం నుండి రాజీనామా చేయాలని గతంలో డిమాండ్ చేసిన వైసీపీ కి ,ఇప్పుడు ఎన్ డీ ఎ లో చేరికకు కూడా కారణాలు వెతుక్కోవాల్సి ఉంటుంది.

🔯ప్రత్యేక హోదా, నిధులు వైసీపీ తీసుకుని రాకపోతే వైసీపీ కేంద్రంలో భాగస్వామ్యం
“రాష్ట్ర ప్రయోజనం కోసం”
అనే కారణం కన్నా అతి ముఖ్యమైన ఇతర విషయాలు ఉన్నాయని రాష్ట్ర ప్రజలు నమ్మకతప్పదు.

🔯ఆంద్రప్రదేశ్ లో సొంతంగా ఎదుగుదామనుకునే బీజేపీ కి వైసీపీ తో స్నేహం తో ద్వారాలు మూసుకొని పోయినట్లే.

🔯రాజకీయాలలో అవినీతి ప్రక్షాళన గురించి మాట్లాడే
నరేంద్రమోదీ గారి విశ్వసనీయత కు పరీక్ష.

విశ్లేషణ :
జెట్టి శ్రీ మారుతీ కుమార్

To Top

Send this to a friend