‘బుట్టా’ సర్దుకుంది.. జగన్ కు షాకేనా.?

రాష్ట్రపతి ఎన్నిక కోసం వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశానికి ఒక ఎంపీ హాజరుకాలేదు. దీంతో జగన్ కు ఇది షాకేనని వార్తలు వెలువడుతున్నాయి. ఆ ఎంపీ పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది..

రాష్ట్రపతి ఎన్నికలో ఓటేయడం కోసం జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి వైసీపీ ఎంపీ బుట్టా రేణుక హాజరుకాలేదు. కొన్ని రోజులుగా ఎంపీ బుట్టా రేణుక వైసీపీకి గుడ్ బై చెబుతారని వార్తలు వెలువడుతున్నాయి.

అయితే పార్టీ మార్పుపై బుట్టా రేణుక స్పందించారు. వైసీపీని వీడే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. వైసీపీ సమావేశానికి తాను హాజరుకాలేనని ఎంపీ మేకపాటికి, వైసీపీ అధిష్టానానికి ముందే చెప్పినట్టు రేణుక వెల్లడించారు. అభివృద్ధి పనుల విషయంలో తాను నారా లోకేష్ ను కలిసానని.. అంత మాత్రాన పార్టీ మార్పుపై వార్తలు వెలువడడం దారుణమన్నారు. వైసీపీ తాను వీడనని స్పష్టం చేశారు.

To Top

Send this to a friend