టీడీపీకి షాక్ ఇచ్చిన వైసీపీ..

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. అప్పుడే ట్రైయిన్ రివర్స్ అవుతోంది. ఏపీ రాజకీయాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీలు రెండు నువ్వా నేనా అన్నట్టు గా తలపడుతున్నాయి. ఏపీలో ఈసారి అధికారాన్ని వైసీపీ జీవన్మరణ సమస్య గా భావిస్తోంది. అందుకే జగన్ పాదయాత్రకు దసరా తర్వాత శ్రీకారం చుట్టారు. ఢిల్లీ నుంచి రాజకీయ వ్యూహకర్తను రప్పించుకొని రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే వచ్చేసారి అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా టీడీపీ, వైసీపీలకు మిగతా పార్టీల మద్దతు అనివార్యంగా మారింది..

2019 ఎన్నికల్లో గెలవాలంటే ఏపీలో ఖచ్చితంగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వైసీపీ, టీడీపీలకు కీలకం.. ఇందులో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కీరోల్ పోషించనుంది. ఇక వామపక్షాలు, కాంగ్రెస్ లకు కూడా అంతో ఇంతో ఓటు బ్యాంకు కలిగియున్నాయి. కాంగ్రెస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికీ దక్కినా ఆయా ప్రాంతాల్లో పార్టీలకు ఓట్లు పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు తొలిసారి వైసీపీ..అధికార టీడీపీకి షాక్ ఇస్తోంది.. కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీ మారేందుకు సిద్ధపడ్డారట.. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కాలం చెల్లిందని నమ్మి ఆయన త్వరలోనే వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు టీడీపీని తీవ్రంగా విమర్శించిన డీఎల్ రవీంద్రా రెడ్డి టీడీపీలో చేరడం నచ్చకనే ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారని తెలిసింది. ఇప్పటికే వైసీపీ నాయకులతో డీఎల్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. జగన్ ఓకే అంటే త్వరలోనే కడపలో వైసీపీలో చేరుతారని సమాచారం. డీఎల్ చేరికతో కడపలో వైసీపీ మరింత బలపడడం ఖాయంగా కనిపిస్తుండగా.. కడపలో బలపడాలని స్కెచ్ గీస్తున్న అధికారపార్టీ టీడీపీకి ఇది ఓ రకంగా షాక్ అనే చెప్పవచ్చు..

To Top

Send this to a friend