వైసీపీలోకి నాగార్జున.?

వచ్చే 2019 ఎన్నికల్లో గెలవడం కోసం జగన్ తీసుకొచ్చిన ప్రశాంత్ కిషోర్ పని మొదలుపెట్టారు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ సూచనలు వైసీపీలో సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రశాంత్ వైసీపీలోని సీనియర్ నేతలను దూరంగా పెట్టి నవ యువకులకు పార్టీలో అవకాశం ఇవ్వాలని సూచించాడట.. దాంతోపాటు సినీ గ్లామర్ ను వైసీపీకి జోడించాలని అగ్రహీరోలను పార్టీలో చేర్చుకోవాలని సూచలను ఇచ్చారట.. దీంతో వైసీపీ అధినేత జగన్ సినీ కధా నాయకులను ఆకర్షించే పనిలో పడ్డాడట..

హీరో నాగార్జున తో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నాగార్జునను వైసీపీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారట.. ఇలా నాగార్జున ఎంట్రీతో వైసీపీకి సినీ గ్లామర్ తెచ్చి నటులను ఆకర్షించాలని జగన్ భావిస్తున్నట్ట తెలిసింది.

నిజానికి గడిచిన 2014 ఎన్నికల్లోనే హీరో నాగార్జున రాజకీయాల్లోకి రావాలని చూసినా ఎందుకో పోటీ చేయలేదు. ఇప్పుడు మళ్లీ 2019 ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. నాగార్జున సాయంతో వీలైనంత వరకు సినిమా హీరోలు, నటులను పార్టీలో చేర్చుకోవాలని ప్రశాంత్ సూచించినట్టు తెలిసింది. దీన్ని వైసీపీ అధినేత జగన్ అమలు చేయడానికి రంగం సిద్దం చేసినట్టు తెలిసింది. మరి నాగార్జున వైసీపీలో చేరుతారా లేదా అన్న కొద్దిరోజుల్లోనే తేలనుంది.

To Top

Send this to a friend