ఫ్లాష్ సేల్.. రూపాయికే రెడ్ మీ ఫోన్లు

ఇప్పుడు దేశీయ మార్కెట్లో షియోమీ రెడ్ మీ ఫోన్లు ఒక సంచలనం.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో విడుదలవుతున్న ఈ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 6వేల నుంచి 10 వేలలోపు అద్భుతమైన ఫీచర్లున్న ఫోన్లను షియోమీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రతి వారం రెడీ 4ఏ కోసం ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. ఆ ఫోన్లు అస్సలు దొరకకుండా అమ్ముడవుతున్నాయి. వారినికి 20 లక్షల రెడ్ మీ ఫోన్లు అమ్ముడుపోతున్నాయట.. డిమాండ్, ఆదరణ చూసిన షియోమీ ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం మరో భారీ ఆఫర్లతో ముందుకొస్తోంది. ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించి మూడేళ్లు అయిన శుభసందర్భంగా వినియోగదారులకోసం కొన్ని రెడ్ మీ ఫోన్లను షియోమీ వెబ్ సైట్ లో రూ.1కే అందుబాటులో ఉంచింది.

ఈనెల 20న మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టాక్ అయిపోయే వరకు రూ.1 కే రెడ్ ఫోన్ల విక్రయాన్ని తమ షియోమీ వెబ్ సైట్ లో ఉంచినట్టు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంకా ఇయర్ ఫోన్లు, సెల్ఫీ స్టిక్ లు , వీఆర్ ప్లేలు కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ ఫ్లాష్ సేల్ 20, 21న ఉదయం 12 గంటలకు మొదలై మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం గంట మాత్రమే ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ సేల్ లో ఇటీవల లాంచ్ చేసిన రెడ్ 4, రెడ్ మీ నోట్, రెడ్ మీ 4ఏ స్మార్ట్ ఫోన్లను రూ.1కే అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. అలాగే ఇతర రెడీ యాక్ససరీలు అయిన వైఫై రిపీటర్, 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ తదితర వాటిని కూడా రూ.1కే అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది.

To Top

Send this to a friend