ఐసిస్ నే భయపెడుతున్న ‘మొసాద్’

మొసాద్.. ఇజ్రాయిల్ గూఢచర్య సంస్థ. ఇది ఎంతో భీకరమైనది.. డెడ్లీ ఆర్గనైజేషన్ అని ఇతర దేశాలు దీన్ని పిలుస్తాయి. అంటే తలపడితే చంపేసే సంస్థ. మొసాద్ ధైర్య సాహసాలు, సీక్రెట్ ఆపరేషన్లు చూశాక ఇండియన్ నిఘా విభాగం ‘రా’ సైన్యానికి కూడా మొసాద్ చేత శిక్షణ ఇప్పించారంటే వారి శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవచ్చు.

ఇజ్రాయిల్ దేశానికి ప్రమాదకరంగా భావించిన దేన్నైనా.. అది ఏ దేశంలో ఉన్నా సరే అర్థరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా మొసాద్ సైన్యం వెళ్లి తుదముట్టించి వస్తారట.. ‘ఇజ్రాయిల్ ఫస్ట్.. మిగతావి లాస్ట్’ అనే నినాదంతో పనిచేస్తున్న మొసాద్ సైన్యం సీక్రెట్ ఆపరేషన్లు ప్రధాని నరేంద్రమోడీ పర్యటన నేపథ్యంలో కోకోల్లలుగా వెలువడుతున్నాయి.. ఇజ్రాయిల్ గూఢచర్య సంస్థ మొసాద్ .. ప్రపంచంలోకెల్ల అమెరికా కంటే కూడా అత్యంత బలమైన శత్రుదుర్భేధ్య నిఘా విభాగం..

ఈ మొసాద్ చేసే పనులు వింటే అందరూ ఆశ్చర్యపోతారు. ఎక్కడా ఎవరికీ తెలియకుండా శత్రువులను తుదముట్టించడంలో మొసాద్ తీరే వేరు.. ఎవ్వరికీ కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాలో కూడా మొసాద్ నిఘా విభాగం సైన్యం గుట్టుచప్పుడు కాకుండా దాడులు చేసింది. సిరియాలోని అతిపెద్ద అణు రియాక్టర్ ను బాంబులతో పేల్చేసింది. ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు పక్కనే ఉన్న ఇజ్రాయిల్ జోలికి మాత్రం పోరు. ఇజ్రాయిల్ తో పెట్టుకుంటే ఐసిస్ బతికి బట్టకట్టదని వారికి తెలుసు.. అందుకే సిరియాకు ఆనుకొని ఉన్న ఇజ్రాయిల్ పై దాడి చేసేందుకు ఐసిస్ ఉగ్రవాదులు వెనుకాడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..

ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలు శత్రుదుర్భేధ్యమైనవి.. అత్యాధునిక యుద్ధ విమానాలు, సామాగ్రిని తయారు చేసుకోవడంలో ఎంతో పురోగతి సాధించింది. అత్యాధునిక డ్రోన్లు, యుద్ధవిమానాలు, రక్షణ, గూఢచర్యం విషయంలో అమెరికా కంటే మెరుగ్గా ఇజ్రాయిల్ వ్యవస్థలున్నాయి. అందుకే ఐసిస్ ఉగ్రవాదులు బ్రిటన్,ఫ్రాన్స్, యూరప్ సహా అమెరికా, ఆస్ట్రేలియాల్లో దాడులు చేస్తోంది కానీ పక్కనే ఉన్న ఇజ్రాయిల్ ను కన్నెత్తి కూడా చూడడం లేదు. తమకు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా యుద్ధం చేసి శత్రువులను చంపడంలో ఇజ్రాయిల్ దిట్ట. అందుకే మోడీ ఆ వ్యవస్థలను తమకు అమ్మాలని ఇజ్రాయిల్ తో ఒప్పందం చేసుకోవడం విశేషం..

To Top

Send this to a friend