రాత్రిళ్లు మహిళల జట్టు మాయం.. కలకలం..

ఉత్తర భారతదేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని నిద్ర పోతున్న మహిళల జుట్టు కట్ చేస్తున్న వైనం పలు రాష్ట్రాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఇంట్లోకి వచ్చి.. కేవలం మహిళల జుట్టు మాత్రమే కట్ చేస్తున్న ఈ వైనం పలురాష్ట్రాల్లోని మహిళలకు కంటి నిండా నిద్ర లేకుండా ఓయింది. ఎందుకంటే.. ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నా.. వాటిని పట్టించుకోని ఈ జడ దొంగ.. జుట్టును కసిదీరా కట్ చేయటంపై పలు వాదనలు వినిపించాయి.

ఇదంతా గ్రహాంతరవాసుల పనిగా.. దెయ్యమే ఇదంతా చేస్తుందంటూ కథలు కథలుగా చెప్పుకొచ్చారు. మంత్రగాళ్ల పని అని కొందరంటున్నారు. రోజురోజుకి ముదిరిపోవటంతో.. మీడియాలో ఫోకస్ పెరిగిపోవటంతో పోలీసుల రంగప్రవేశం చేశారు. చివరకు ఎన్నోప్రయత్నాలు చేసి.. చివరకు జుట్టు దొంగను పట్టుకున్నారు.ఆ జుట్టుదొంగ ఎవరో కాదు.. ఒక పురుగుగా తేల్చారు.

ఈ పురుగును చూపిస్తూ.. పుకార్లను నమ్మొద్దంటున్నారు. ఈ పురుగు ముందు జుట్టను పెడితే.. అది క్షణాల్లో కట్ చేయటం చూసిన వారంతా అవాక్కు అవుతున్నారు. ఈ పురుగును బంధించిన పోలీసులు.. ఈ ఉదంతంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అంతా బాగుంది కానీ.. నాలుగైదు వెంట్రుకల్ని పరపరా కొరికేస్తున్న పురుగు.. అంత పెద్ద జడను కొరికేస్తుందా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.

To Top

Send this to a friend