ఆ 9 బ్యాంకులు మూతేనా..?

 

దివాళకు దగ్గరగా ఉన్న దేశంలోని 9 ప్రముఖ బ్యాంకులను మూసివేయబోతున్నారని.. ఈ మేరకు ఆర్బీఐ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఆ 9 బ్యాంకులు ఇవేననే వార్త కొద్దిరోజులుగా ఫేస్ బుక్, వాట్సాప్ లలో చక్కర్లు కొడుతోంది. అది వాస్తవమా.. కాదా అన్న సంగతిని పక్కనపెడితే సదురు 9 బ్యాంకులకు ఇప్పుడు కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ బ్యాంకుల్లో ఖాతాలున్న వినియోగదారులందరూ తమ ఖాతాల్లో ఉన్న డబ్బునంతటినీ విత్ డ్రా చేసుకుంటున్నారట.. బ్యాంకు లోనులు కట్టడం లేదట.. దీంతో ఆ బ్యాంకులన్నీ మరింత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

 

లాభాలు లేకుండా నెట్టుకొస్తున్న ఆ తొమ్మిది బ్యాంకులను రద్దు చేసి వాటిని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయబోతున్నారనే వార్త కూడా వినిపిస్తోంది. అంటే ఖాతాదారులు కూడా వేరే బ్యాంకుల్లోకి మారిపోతారు. ఆ ప్రక్రియ జరగడానికి మూడు నెలలు పడుతుంది. అప్పటివరకు ఖాతాదారులు డబ్బు లావాదేవీలు జరపడానికి ఉండదు. దీంతో ఆయా ఖాతాల్లో ఉన్న సొమ్మును ఇప్పుడు అందరూ విత్ డ్రా చేసుకుంటున్నారు..

 

ఈ వార్త తెలుసుకున్న ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.. ఆ తొమ్మిది బ్యాంకులైన .. కార్పొరేషన్ బ్యాంకు, యూకో బ్యాంకు, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆంధ్రాభ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డేనా బ్యాంక్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను మూసి వేయడం లేదని, ఏ బ్యాంకుల్లో విలీనం చేయడం లేదని.. అవి అలానే నడుస్తాయని పేర్కొంది. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులను నమ్మవద్దని ఆర్బీఐ ఖాతాదారులకు స్పష్టం చేసింది. ఇక ఆయా ఖాతాల్లో ఉన్న డబ్బులను కూడా విత్ డ్రా చేసుకోవద్దని కోరారు. ఇలా 9 బ్యాంకుల రద్దు వార్త ఫేక్ అని తేలింది.

To Top

Send this to a friend