ఆ ముగ్గురు అడ్వాణీని ఎన్నుకుంటారా.?


రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతిగా ఎవరిని చేస్తే బాగుంటుందన్న విషయంపై బీజేపీలో ముగ్గురు సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పజెప్పింది. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించేందుకు గాను భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపేందుకు గాను కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు సభ్యులుగా కమిటీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఏర్పాటు చేశారు.

జూన్ 14న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచే నామినేషన్లు వేస్తారు. జూలై 17న పోలింగ్, 20 న కౌంటింగ్ నిర్వహిస్తారు. అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థికి ప్రస్తుతం ఎలక్ట్రోరల్ కాలేజీలో 48.64శాతం ఓట్లున్నాయి. యూపీఏ ఉమ్మడి అభ్యర్థికి 35.47శాతం ఓట్లున్నాయి.

దేశంలోని రాజకీయ పార్టీలందరితో కేంద్ర మంత్రుల బృందం చర్చలు జరుపుతుంది. మేజిక్ ఫిగర్ ఇంకా 1.5 శాతం ఓట్లు బీజేపీకి తక్కువగా ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉన్న వైసీపీ, అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్ ల మద్దతు బీజేపీకి అవసరం.. అందుకోసం కేంద్రమంత్రులు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇక రాష్ట్రపతిగా ఈ ముగ్గురు కేంద్రమంత్రులు తమ గురువైన అడ్వాణీని అవకాశం ఇస్తారా లేక మరొకరిని నిలబెడతారా అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. అడ్వాణీని చేయకపోతే బీజేపీలోనే అసమ్మతి మొదలుకావచ్చు. మోడీ ప్రధాని కావడం కోసం త్యాగం చేసిన అడ్వాణీకి సరైన ప్రాధాన్యం ఇవ్వాలంటే రాష్ట్రపతిని చేయడం పరిష్కారమని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తారు. కానీ మోడీ, ముగ్గురు కేంద్రమంత్రుల మనసుల్లో ఏముందనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదు.

To Top

Send this to a friend