భర్త మర్మాంగాన్ని కోసి..

 

 

వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు ఎంతలా చిన్నా భిన్నం అవుతాయో ఈ సంఘటన రుజువు చేసింది.. భర్త ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం నచ్చని భార్య ఏకంగా అతడి మర్మాంగాన్ని కోసి బుద్ది చెప్పింది. తమిళనాడులోని గుడియాట్టాంకు చెందిన జగదీశం, సరసు దంపతులు.. 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు కూడా. మనస్పర్ధలు రావడంతో ఏడాది క్రితం సరసు పుట్టింటికి పోయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పిల్లలు కూడా నాన్న వాళ్లింట్లోనే ఉంటున్నారు. అయితే తమ కొడుకు పుట్టిన రోజు సందర్భంగా సరసు మళ్లీ భర్త దగ్గరకు వచ్చి పుట్టినరోజు వేడుక నిర్వహించింది.

 

 

భర్త మారాడు అని గ్రహించి మళ్లీ కాపురం మొదలుపెట్టింది. పిల్లలతో కలిసి ఉండగా.. మరుసటి రోజే భర్త మళ్లీ అదే పనిచేయడంతో భార్యకు విసుగు వచ్చింది. తరువాత రోజు కూడా ఎవరో మహిళ దగ్గరకు పోయి రాత్రి లేటుగా వచ్చిన భర్త.. భార్యతో గొడవ పెట్టుకున్నాడు. నానా యాగా చేశాడు. ఆ తర్వాత పడుకున్నాడు. భర్త వివాహేతర సంబంధాలతో విసిగి వేసారిన భార్య సరసు అతడు పడుకున్నాక భర్త మర్మంగాన్ని కోసివేసి.. దాన్ని పర్సులో పెట్టుకొని అదే రాత్రి పుట్టింటికి వెళ్లిపోయింది.

 

కత్తితో మర్మాంగాన్ని కోయడంతో రక్తం కారుతూ భర్త జగదేశం కేకలు పెట్టాడు. అది విన్న చుట్టుపక్కలవారు జగదీశంను ఆస్పత్రికి తరలించారు. సరసును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అక్రమ సంబంధాల పెట్టుకున్న భర్తకు మంచి బుద్ది చెప్పిందో భార్య.

To Top

Send this to a friend