అసలు ఈ రోజునే యోగాడే గా ఎందుకు?

ఈ రోజు కర్కాటక సంక్రాంతి.. ఈ తిథిని మనం ఎక్కువగా జరుపుకోం.. కానీ ఒక మాసం నుండి వేరొక మాసం మధ్యలో వచ్చే తిథిని సంక్రాంతి అంటాము.. అనగా ఇది రెండు మాసాల మధ్య ఉన్న సంధి కాలమన్నమాట. ఉదాహరణకు ఉత్తరాయణ ప్రారంభకాలంలో వచ్చే సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారు.. ఇలా ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు వెళ్ళే తిథిని బట్టి ఆయా సంక్రాంతులు ఉంటాయి.. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది…అయితే సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించే సమయాన వచ్చే ఈ సంక్రమణాన్ని కర్కాటక సంక్రమణం అంటారు.

*ఈ రోజే జూన్ ఇరవై ఒకటి.. ప్రపంచ యోగాడే.

. ఈ రోజు అతి దీర్ఘమైన పగలు.. ఉంటుంది.. సూర్యుడు తన గమనంలో అత్యధిక కక్ష్యలో భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన ఇది సంభవిస్తుంది.. దీనినే సమ్మర్ సాల్ట్సైస్ అని ఆంగ్లములో చెపుతారు..
ఇది సూర్యుని దక్షిణాయనమునకు ప్రారంభం.. మనకు మకర సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా ఆరునెలలలకు తర్వాత వచ్చే తిథి ఇది..
ఈ రోజు నుండి దేవతలకు రాత్రి ప్రారంభమవుతుంది..ఈ రోజుకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే.. ఈ రోజును ప్రపంచ యోగా దినోత్సవం గా గుర్తిస్తూ.. బహుళ ప్రాచుర్యం పొందేలా చేసారు..

To Top

Send this to a friend