యోగి కండోమ్ లు పంచడమా.?

ఆయన దేశంలోనే గొప్ప హిందుత్వ వాది.. గో సంరక్షుడు.. కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ లోంచి వచ్చినవాడు. ఆయనే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.. అదృష్టం కలిసివచ్చి దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. యూపీని సంస్కరిస్తున్నాడు. ఈ సంస్కరణల్లో హిందుత్వ వాది అయ్యుంది కూడా హిందూ ధర్మాలకు వ్యతిరేకంగా ముస్లింలు ఇతర వర్గాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కొత్త జంటకు యూపీ సర్కార్ ఇస్తున్న గిఫ్ట్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

దాదాపు 27 కోట్లకు పైగా జనం యూపీలో నివసిస్తున్నారు. ఇది అమెరికా దేశ జనాభాకు సమానం. మరి ఇంతలా పెరిగిపోతున్న యూపీ రాష్ట్ర జనాభాను కంట్రోల్ చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్లాన్ చేశారు. అనుకున్నదే తడువుగా ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇప్పుడా పథకం మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మిషన్ పరివార్ వికాస్’ పథకంలో భాగంగా కొత్త జంటలకు ఓ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ లో కండోమ్ లతో పాటు ఇతర గర్భ నిరోధక సాధనాలతో కూడిన ఒక కిట్ ను ఇవ్వాలని నిర్ణయించారు.

ఈనెల 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ‘నయీ పహల్’ అనే పేరుతో ఈ పథకాన్ని యోగి ప్రకటించబోతున్నారు. ఈ గిఫ్ట్ లో కండోమ్ లు, గర్భనిరోధక సాధనాలతోపాటు శృంగారం, కుటుంబ నియంత్రణ, ప్రసవాల మధ్యన గ్యాప్ గురించి వివరించే కరపత్రాలను పెట్టారు. ఇలా యోగి ప్రభుత్వం జనాభా నియంత్రణకు తీసుకొచ్చిన పథకం కొత్తగా పెళ్లయిన జంటల్లో మాత్రం వ్యతిరేకతకు కారణమవుతోందట.. యోగి కండోమ్ లు పంచబోతున్నాడనే వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

To Top

Send this to a friend