వైసీపీకి దూరంగా.. రోజా ఎందుకిలా..?

ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన ‘సేవ్ విశాఖ’ సభకు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా హాజరుకాకపోవడం సంచలనం రేకెత్తించింది. ఇంటా బయటా, అసెంబ్లీలో, మీడియాలో చంద్రబాబుపై, టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడే రోజా వైసీపీ అధినేత జగన్ నిర్వహించే ప్రతి సభలోనూ పాల్గొంటుంది. మాటలతో ఇరగదీస్తుంది. కానీ నిన్నటి సభలో రోజా హాజరుకాకపోవడంతో ఆమె పార్టీ మారబోతోందా.? అన్న అనుమానాలు రేకెత్తాయి.

రోజా టీడీపీ నేతలపై నోరుపారేసుకోవడం.. అది వైసీపీకి ఇబ్బందిగా మారడంతో ఇటీవలే వైఎస్ జగన్, రోజాకు క్లాస్ పీకారని వార్తలు వినిపించాయి. పార్టీలో అగ్రెసివ్ ఎమ్మెల్యేగా ఉండే రోజా ఈ విశాఖ సభకు హాజరుకాకపోవడానికి జగన్ మందలింపే కారణమని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు.

టీడీపీలో కూడా రోజా ఇలానే అగ్రెసివ్ గా ఉండి విమర్శల పాలయ్యారు. టీడీపీకోసం ఎంతో కష్టపడ్డా ఆమెకు ప్రతిఫలం దక్కలేదు. ఇప్పుడు వైసీపీలో చేరాక కూడా రోజా అలానే ప్రవర్తిస్తోంది. ఆమె రాజకీయంగా అలజడులు రేపుతోంది. వైసీపీ అధినేత జగన్ సైతం రోజా వాగ్ధాటికి తట్టుకోలేక క్లాస్ పీకాడు . దీంతో ఇప్పుడు రోజా అలిగి విశాఖ సభకు డుమ్మా కొట్టింది. మరి వైసీపీలో ఉంటుందో లేక పార్టీ మారుతుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

To Top

Send this to a friend