విరహ వేదన వెనుక కారణమిదీ..


ఆషాఢం.. కొత్తగా పెళ్లైన జంటను ఈ నెల పాటు దూరం పెడతారు.. కారణం ఏంటయ్యా అంటే.. అత్త మొఖం కోడలు చూడకూడదట.. చూస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం అట.. ఈ కారణం చెప్పి నెలరోజుల పాటు కొత్త జంటను దూరంగా పెడుతుంటారు.. వాళ్లకు విరహ వేదన కలిగిస్తుంటారు.. నిజానికి దీనికో శాస్త్రీయ కారణం ఉంది..

 

ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశితో మన తెలుగు సంవత్సరాదిలో తొలి పండుగలు ప్రారంభమవుతాయి. ఆషాఢమాసంతోనే వర్షాలు మొదలవుతాయి. అందరూ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారు. కొత్త జంట ఇంట్లో ఉంటే వ్యవసాయంపై పెళ్లికొడుకు మనసు లగ్నంచేయడని అందుకే పెళ్లికూతురును ఆషాఢంలో పుట్టింటికి పంపుతారు. తద్వారా వ్యవసాయ పనులు ఈనెలలో పూర్తి చేస్తారని పెద్దలు ఈ నియమం పెట్టారు..

 

ఇదేకాకుండా ఈనెలలో కొత్త జంట కలిసి గర్భం వస్తే సరిగ్గా 9 నెలల తర్వాత అంటే ఏప్రిల్, మే నెలల్లో పురుడు పోసుకుంటుంది. ఆ మండే ఎండలకు తల్లీ పిల్లా తట్టుకోలేరు. అందుకే ఈ ఆషాఢంలో కొత్త జంట కలువవద్దని నియమం పెట్టారు. తద్వారా వ్యవసాయ పనులు చేసుకోవడంతో పాటు ఏండాకాలంలో పురుడుపోసుకోకుండా జాగ్రత్త పడతారన్నమాట.. ఇలా పెద్దలు ఆషాఢం లో పెట్టిన నియమం మన తెలుగునాట కొనసాగుతూనే ఉంది. సంప్రదాయంతో పాటు శాస్త్రీయ కోణంలో అప్పటి పెద్దలు ఈ నియమం పెట్టారు..

To Top

Send this to a friend