కృష్ణారావు సస్పెన్షన్ వెనుక కథేంటి.?

ఆయనో సీనియర్ ఐఏఎస్ అధికారి. విభాజిత ఏపీకి తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ కోసం ఎంతో సేవ చేశారు. ఆయన ప్రతిభను చూసి చంద్రబాబు విభాజిత ఏపీ తొలిప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఎంతో ముక్కుసూటిగా వ్యవహరించే సీనియర్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు అందరి చేత శభాష్ అనిపించేలా పనులు చేశారు. ఆయన దిగిపోయాక కృష్ణారావు పనితనానికి మెచ్చి సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర సమాచార కమిషనర్ పదవి ఇప్పిస్తాను చేస్తావా అని కృష్ణారావును అడిగాడట.. కానీ ఆయన తనకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని.. బ్రాహ్మణులకు సేవ చేస్తూ తరిస్తానని చెప్పాడు . బాబు ఓకే అని పదవి కట్టబెట్టాడు. ఇక్కడికి సీన్ కట్ చేస్తే..

*కరుణించవయ్యా బాబూ..
బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి కట్టబెట్టాక కొన్ని నిధులు, నియామకాలు చేపట్టాల్సిందిగా కృష్ణారావు చంద్రబాబును కోరేందుకు చాలా సార్లు అమరావతిలోని సచివాలయానికి వచ్చారట.. కానీ చంద్రబాబు గడిచిన ఆరు నెలలుగా ఈ మాజీ సీఎస్ కు అపాయింట్ ఇవ్వలేదట.. బాబును కలిసేందుకు ఒక్కోరోజు 6 గంటలు వెయిట్ చేసినా ఐవైఆర్ కలవకపోయేసరికి  కలత చెందాడు.. ‘పోనీ చంద్రబాబుతో విమానంలో వెళతా భేటి అవుతా.. బ్రాహ్మణ కార్పొరేషన్ సమస్యలపై మాట్లాడుతానని’ అధికారులను ఎంత ప్రాధేయపడ్డా కృష్ణారావును బాబుతో కలిసే అవకాశం ఇవ్వలేదట..

* తెలుగు తమ్ముళ్లకే నిధులు..
వివిధ కార్పొరేషన్ల కింద ఏపీలో విడుదలయ్యే నిధులన్నీ  క్షేత్రస్తాయిలో తెలుగు తమ్ముళ్లకే కేటాయించాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందట.. కానీ ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్ లో మాత్రం దాన్ని అమలు చేయలేదు.. అర్హులైన పేద బ్రాహ్మణులకు నిధులు కేటాయించారు. ఈ వివాదం కూడా ఐవైఆర్ పై బాబు కోపానికి కారణమైంది. ఐవైఆర్ కేటాయించిన పలు నిధులు వైసీపీ కార్యకర్తలకు చేరాయనే విషయం చంద్రబాబుకు తెలిసింది..

*ఫేస్ బుక్ లో బాబు వర్సెస్ ఐవైఆర్ కృష్ణారావు
క్రమంగా ఐవైఆర్ ను చంద్రబాబు దూరం పెట్టడం.. కృష్ణారావుకు బాబుపై కోపానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతి, అసమర్థ పాలనపై వైసీపీ నేతలు పెట్టిన పోస్టింగులను కృష్ణారావు షేర్ చేశారు. స్వయంగా కొన్ని బాబు అసమర్థతపై వ్యాఖ్యానాలు చేశారు. దీంతో చంద్రబాబుకు ఒళ్లు మండి ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి ఈరోజు తొలిగించేశాడు.

ఇలా మాజీ ప్రధాన కార్యదర్శితో విభేదాలు తెచ్చుకొని ఆయన వ్యతిరేకంగా మారేసరికి బాబు కొరఢా ఝలిపించారు. మాజీ ప్రధాన కార్యదర్శికి పిలిచి మరీ ఇచ్చిన బ్రాహ్మణకార్పొరేషన్ పదవిని ఇచ్చిన బాబు ఉన్నఫళంగా ఊడగొట్టించారు. ఇలా తనకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా.. ప్రవర్తించినా వారి ఇదే గతి పడుతుందని బాబు మరోసారి హెచ్చరికలు పంపారు. ఇదివరకే ఇద్దరు సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయించిన చంద్రబాబు ప్రభుత్వం., మాజీ సీఎస్ కృష్ణారావు పదవిని మాత్రమే ఊడగొట్టించడం ఇక్కడ గమనార్హం.

To Top

Send this to a friend