బాలయ్యకు ఈమె అంటే ఎందుకు అభిమానం?


బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ‘పైసా వసూల్‌’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. దసరా సందర్బంగా ఆ సినిమాను విడుదల చేసేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ‘పైసా వసూల్‌’ చిత్రం విడుదల కావడమే ఆలస్యం తన 102వ చిత్రంలో బాలకృష్ణ నటించబోతున్నాడు. ఇటీవలే ఆ సినిమా ప్రారంభం అయ్యింది. కెఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య తర్వాత సినిమా ఉండనుంది. ఆ చిత్రంలో హీరోయిన్‌ తాజాగా ఫైనల్‌ అయ్యింది.

ఇప్పటికే బాలకృష్ణ ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాల్లో నయనతారతో నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి ఆమెతో నటించేందుకు బాలకృష్ణ ఆసక్తి చూపుతున్నాడు. తనతో నటించేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి చూపక పోవడంతో పాటు, కొత్త హీరోయిన్స్‌ బాలయ్యకు జత కాలేరు. దాంతో ఇప్పుడు ఉన్న హీరోయిన్స్‌ అయిన శ్రియ, నయన్‌లను మార్చి మార్చి వాడేస్తున్నాడు.

ఇటీవలే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో శ్రియతో కలిసి నటించిన బాలకృష్ణ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పైసా వసూల్‌’ చిత్రంలో కూడా ఆమెతోనే నటిస్తున్నాడు. ఇక రవికుమార్‌ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు నయన్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో నయన్‌ చాలా బిజీ హీరోయిన్‌. దాంతో ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి మరీ ఎంపిక చేయాలని బాలయ్య సూచించినట్లుగా తెలుస్తోంది.

To Top

Send this to a friend