అల్లు అర్జున్‌ మెగాస్టార్‌ ఏంటి?

అల్లు అర్జున్‌ క్రేజ్‌ సినిమా సినిమాకు పెరిగి పోతుంది. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత మెగా చైర్‌ను అందుకునేది అల్లు అర్జున్‌ అంటూ ఒక వర్గం మెగా ఫ్యాన్స్‌ ప్రచారం చేస్తున్నారు. అల్లు అర్జున్‌ను భవిష్యత్తు మెగాస్టార్‌గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటి వరకు అది ఫ్యాన్స్‌ వరకే ఉండి పోయింది. తాజాగా ఆ విషయాన్ని ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ బుక్‌మై షో వారు మెగాస్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘డీజే’ చిత్ర టికెట్స్‌ను బుక్‌ చేసుకోండి అంటూ అక్కడ ఇక్కడ యాడ్స్‌ ఇస్తుంది.

ఫ్యాన్స్‌ అంటే వారి అభిమానం అనుకోవచ్చు, కాని ఒక ప్రముఖ సంస్థ అల్లు అర్జున్‌ను మెగాస్టార్‌ అంటూ సంభోదించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అల్లు అర్జున్‌ స్వయంగా తనను అలా పిలిపించుకుంటున్నాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. మరి కొందరు అల్లు అర్జున్‌ను ఎత్తేసేందుకు వారు ఇంత మాట అన్నారని అంటున్నారు. మొత్తానికి బుక్‌ మై షో వేసిన మెగాస్టార్‌ అల్లు అర్జున్‌ టైటిల్‌ పెద్ద వివాదంకు తెర లేపుతుంది.

ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ఆధిపత్యం కొనసాగుతుందని, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ల మద్య తీవ్రమైన పోటీ ఉందని విశ్వసనీయ సమాచారం. వీరిద్దరు కూడా తమ సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్‌ కంటే రామ్‌ చరణ్‌ వెనుక పడి ఉన్నాడు. వరుస విజయాలతో అల్లు అర్జున్‌ దూసుకు పోతున్నాడు. అందుకే బన్నీని మెగాస్టార్‌ అంటున్నారు.

To Top

Send this to a friend