ఎసీడీటీ మాత్రలతో ప్రాణాలకే ప్రమాదం..

జిహ్వచాపల్యం.. మనిషిని దేన్నైనా తినేలా చేస్తుంది. ఈ మధ్య టీవీల్లో, పేపర్లలో వస్తున్న విభిన్న రుచుల వంటకాలతో జనాల అభిరుచి కూడా మారింది. ఇంట్లో తిండి తగ్గించేసి బయట తిండి ఎక్కువైపోయింది.. దీనికారణంగా ఉబకాయం పెరుగుతోంది. ఫంక్షన్లు, పార్టీల్లో బిర్యానీ , చికెన్, మటన్, ఫిష్ తో పాటు 20 రకాల ఆహార పదార్థాలను లాగించేస్తున్నాం. కానీ తిన్నాకే కడుపు ఉబ్బి ఎసిడీటీ సమస్య బాధిస్తుంది. ఆ బాధను తప్పించుకోవడానికి మార్కెట్లో దొరికే ఎసిడీటీ మాత్రలు, టానిక్ లు, పౌడర్ లను తాగి ఉపశమనం పొందుతున్నాం.. అయితే ఈ మాత్రలు చాలా ప్రమాదకరణమని ఒక పరిశోధనలో తేలింది..

అసిడీటీ మాత్రల వల్ల దీర్ఘకాలంలో మూత్ర పిండాల వ్యవస్థ దెబ్బతిని సమస్యలు వస్తాయని అమెరికన్ పరిశోధకులు తేల్చారు. అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. అసిడీటీ మాత్రలు వాడుతున్న దాదాపు 2,75,000 మందిపై వీరు పరిశోధన చేశారు.వారిలో మరణముప్పును ఎసిడీటీ మాత్రలు 50శాతం పెంచుతాయని తేల్చారు.

అతిగా తిని అరగకపోతే మాత్రలు వేసుకునే వారు జర జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎసీడీటీ వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుందని.. తద్వారా 50శాతం మరణ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు తేల్చడంతో ఇక నుంచి ఎసిడీటీ మాత్రల జోలికి వెళ్లకుండా తిండి విషయంలో కొంచెం జాగ్రత్త పాటిస్తే మంచిదని చెబుతున్నారు.

To Top

Send this to a friend