విలన్ చంద్రబాబు / లక్ష్మీపారతి.?


‘‘ఎన్టీఆర్ ఎవరెస్ట్. తెలుగు జాతి ఆత్మగౌరవం ఆయన.. అలాంటి వ్యక్తి మీద ఎలాంటి మచ్చ పడినా అభిమానులు తట్టుకోలేరు.. ఆయనను కించపరిచేలా సినిమా తీస్తే జనాలు వెంటపడి కొడతారు. అందువల్ల ఈ బయోపిక్ లో  రోజుకు కోటి రూపాయలు ఇస్తానన్న తాను నటించను’ అని నటుడు, రచయిత, దర్శకుడు అయిన పోసాని కృష్ణమురళీ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ ను తీస్తానని ప్రకటించిన వర్మ తాజా ప్రకటనపై నటుడు పోసారి కృష్ణమురళీ స్పందించారు. కాంట్రవర్సీగా సినిమా తీస్తే ఎవరూ సహించరని వర్మకు హెచ్చరికలు పంపారు.

కాగా బాలక్రిష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రాజకీయాలను కుదిపేసేదే.. ఎన్టీఆర్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తీరు.. అనంతరం తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం.. అనంతరం చంద్రబాబు అధికారాన్ని లాక్కోవడం తదితర రక్తి కట్టే ఎన్నో సంచలన రాజకీయ సంఘటనలున్నాయి. మరి వీటన్నింటిని వర్మ ఎలా హ్యాండిల్ చేస్తాడోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది..

ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబును విలన్ గా చూపిస్తారా.? లేక లక్ష్మీ పార్వతినా అన్న విషయంలో సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే బావ చంద్రబాబు ప్రభుత్వంలో బాలయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అందువల్ల ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్న చంద్రబాబు ఈ సినిమాలో విలన్ అయ్యే చాన్స్ కనిపించడం లేదు. లక్ష్మీ పార్వతిని విలన్ గా చూపిస్తే ఆమె ఊరుకునే అవకాశం లేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

To Top

Send this to a friend