ఆ 12 మంది ఎవరై ఉంటారు?


తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఉత్కంఠ భరితంగా ‘బిగ్‌ బాస్‌’ షో కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఏ షో కోసం తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఎదురు చూసిన దాఖలాలు లేవు. ఆ మద్య మెగాస్టార్‌ మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం ప్రేక్షకుల ఆసక్తిని కనబర్చారు. కాని ఈస్థాయిలో మాత్రం కాదు. ఎన్టీఆర్‌ కోసం బుల్లితెరను షేక్‌ చేసేందుకు ప్రేక్షకులు సిద్దంగా ఉన్నారు. భారీ టీఆర్‌పీ రేటింగ్‌ను స్టార్‌ మాకు కట్టబెట్టాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

బిగ్‌బాస్‌ షోలో ప్రముఖమైన 12 మంది సెలబ్రెటీలను ఎంపిక చేయడం జరిగింది. ఆ 12 మంది బిగ్‌ బాస్‌ హౌస్‌లో 71 రోజుల పాటు ఉండబోతున్నారు. ఈ 71 రోజులు వారు మరే కార్యక్రమాలు పెట్టుకోరు. వారు ప్రపంచానికి దూరంగా అంటే మీడియా లేకుండా, కనీసం మొబైల్స్‌ కూడా లేకుండా జీవించాల్సి ఉంటుంది. అలాంటి జీవితం అంటే ఇప్పుడు మామూలు విషయం కాదు. ఎవరి వంట వారే చేసుకోవాలి. ఎవరి పనులు వారే చేసుకోవాలి.

ఇంత ఇబ్బందిని ఎదుర్కోబోతూ, తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే ఆ పన్నెండు మంది ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ధన్‌రాజ్‌ మరియు ఈషాలు ఆ పన్నెండు మందిలో ఉన్నారు. మిగిలిన పది మంది సెలబ్రెటీలు ఎవరు అనే విషయం త్వరలోనే విడుదల కాబోతున్న టీజర్‌లో తేలిపోనుంది.

To Top

Send this to a friend