ఆంధ్రప్రదేశ్ కి శతృవు కేసీయారా లేక నారావారా ???

2009లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నపుడు కేసీయార్ సీమాంధ్రులని అన్న మాటలు అక్కడున్న సెటిలర్స్ ని తీవ్రంగా బాధించాయనటంలో ఎటువంటి సంశయం లేదు. విభజనానంతరం సెటిలర్స్ పై దాడులుంటాయని వారు భయపడ్డారు కావున ఆ వ్యతిరేకత 2014 ఎన్నికల పిదప సైతం కొనసాగింది. ఐతే కాలం గడచిన కొద్ది ఎటువంటి దాడులు లేకపోవటం ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సహృద్భావ వాతావరణనలో ఉద్యోగ వ్యాపారాలు కొనసాగటంతో క్రమేపీ తెరాస పై వ్యతిరేకత తొలగిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో పలు అంశాల పట్ల తెలంగాణ సెటిలర్స్ కి తెలుగుదేశం వైఖరి సైతం జుగుప్సు కలిగించింది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన బీజేపీతో లాలూచీ పడి ప్రత్యేక హోదా అంశంలో రాష్ట్ర ప్రయోజనాలు కాలరాయటం ఏపీ వాసులకి నచ్చలేదు. పైగా హోదా ఇవ్వక ప్యాకేజి ఇస్తే దానిని ఎంతో గొప్ప విజయంగా చూపి భాజపాకి సన్మాన సత్కారాలు చేయటం, హోదాకోసం పోరాడే వారిపై కేసులు పెట్టటం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి తెరాస కంటే తెదేపా శతృవనీ కేసీఆర్ కంటే చంద్రబాబు ఎక్కువ ద్రోహం చేస్తున్నారని గ్రహించారు.

వివిధ రంగాలలో అడ్డగోలుగా అవినీతి, చింతమనేని వంటి నాయకుల అరాచకపు రౌడీరాజకీయం అన్నీ కలగలిపితే చంద్రబాబు పై తీవ్ర వ్యతిరేక ఏర్పడింది. ఈ కారణం చేత సీమాంధ్ర మనోభావాలు కలిగిన సెటిలర్స్ నిర్ద్వంద్వంగా నిర్దయగా నిర్దాక్షిణ్యంగా తెదేపా-కాంగ్రెస్ కూటమిని వ్యతిరేకించనున్నారు.

 

To Top

Send this to a friend