ఏదీ హిట్, ఏదీ ప్లాప్..?

ముగ్గురు యావరేజ్ హీరోలు బరిలో ఉన్నారు. శుక్రవారం ఒకరోజే మూడు సినిమాలు విడుదలయ్యాయి. ‘నేనే రాజు.. నేను మంత్రి’, లై, జయ జానకీ నాయక, ఈ మూడు సినిమాలు ప్రస్తుతం థియేటర్ లో సందడి చేస్తున్నాయి. ఫస్ట్ రోజు కావడంతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. ఇక ఈ మూడు సినిమాలపై పబ్లిక్ టాక్ కూడా బయటకు వచ్చేసింది. ఇందులో ప్రేక్షకుల ఓటు ఏ సినిమాకో తెలుసుకుందాం..

*జయజానకీ నాయక
ఈ మూవీకి అగ్ర దర్శకుడు మాస్ ను అద్భుతంగా తెరపై చూపించే బోయపాటి శ్రీను దర్శకుడు. కొత్తదైన కథ.. అందులో కమర్షియల్ అంశాలు ఫుల్లుగా జోడించడంతో ఈ సినిమాకు ప్రేక్షకాదరణ పొందుతోంది. నేనే రాజు నేనే మంత్రి, లై సినిమాల కంటే కూడా ఈ సినిమాకే ప్రేక్షకాదరణ ఉందట.. రెండు యావరేజ్ టాక్ తెచ్చుకోగా బోయపాటి సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. పెళ్లి పీటల మీదే భర్తను పోగొట్టుకున్న హీరోయిన్ అనే కాన్సెప్ట్ తో సినిమా ఆసక్తికరంగా మారడం సినిమాలోని కొత్త పాయింట్. ఇలాంటి కథాంశంతో తెలుగు తెరపై సినిమా రాకపోవడంతో ఈ స్టోరీ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. కొన్ని డైలాగులు హీరోతో బోయపాటి అద్భుతంగా పలికించాడు. మొత్తం మీద ఇది బోయపాటి మార్క్ సినిమాలో కనిపించడంతో మిగతా రెండు సినిమాలతో పోల్చితే ఇదే పెద్ధ హిట్ అంటున్నారు ప్రేక్షకులు..

*లై మూవీ..
నితిన్ అఆ లాంటి గ్రాండ్ హిట్ తర్వాత చేసిన సినిమా లై. ఈ సినిమాలో అందరికీ కావలసిన కమర్షియల్ హంగులు లేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. ట్విస్టులతో ఊపేసిన కూడా కామెడీ, కథ లోకలైజ్ కాకపోవడం తో సాధారణ ప్రేక్షకుడిని మెప్పించలేకపోతోందట.. లై సినిమా కొత్తదనం కోరుకునే వారికి కచ్చితంగా నడుస్తుంది. రెగ్యులర్ మసాలా తెలుగు సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా.. సెకండాఫ్ బోరింగ్ అనే టాక్ వినిపిస్తోందట..

*నేనే రాజు నేనే మంత్రి..
బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రానా హీరోగా చేసిన చిత్రమిది. ఇందులో రానా డైలాగ్స్, యాక్టింగ్ , పొలిటికల్ పంచ్ లు, కాజల్ అందాలు ఫిదా చేశాయని అభిమానులు సంబరపడుతున్నారు. స్టోరీలో కొత్త దనం కనిపించడం లేదని సినీ విశ్లేషకులు, అభిమానులు చెబుతున్నారు. రోటీన్ స్టోరీ కావడంతో సినిమా ఆకట్టుకోవడం లేదట.. ఇక సెకండాఫ్ లో బోరింగ్ కాస్త ఎక్కువైనట్టు చెబుతున్నారు..

To Top

Send this to a friend