మహానాడులో నందమూరి ఫ్యామిలీ ఎక్కడ?

అన్నగారు ఎన్టీఆర్‌ జయంతి సందర్బంగా తెలుగు దేశం పార్టీ మహానాడును నిర్వహించుకుంటుంది అనే విషయం తెల్సిందే. తాజాగా ఎన్టీఆర్‌ జయంతి సందర్బంగా విశాఖలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా తెలుగు దేశం పార్టీ మహానాడు వేడుకను జరుపుకుంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ కనీవిని ఎరుగని రీతిలో మహానాడు కార్యక్రమంను నిర్వహించుకుంటుంది. ఇంత భారీగా జరుగుతున్న వేడుకలో ఒక చిన్న వెలితి ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా మారింది.

మహానాడు అంటే అన్నగారి పుట్టిన రోజు వేడుక, అన్నగారు అంటే నందమూరి ఫ్యామిలీ. కాని నందమూరి ఫ్యామిలీకి చెందిన వారు ఏ ఒక్కరు కూడా ఈ వేడుకలో లేక పోవడం ఈసారి చర్చనీయాంశం అవుతుంది. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు అయిన హరికృష్ణ గత కొన్నాళ్లుగా చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా పార్టీకి దూరంగా ఉంటున్నాడు. దాంతో ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇక కళ్యాణ్‌ రామ్‌ మరియు ఎన్టీఆర్‌లను చంద్రబాబు నాయుడు పార్టీకి దూరంగా పెడుతున్నాడు. గతంలో వీరిద్దరు హాజరు అయినా కూడా ఇప్పుడు విభేదాల కారణంగా మహానాడు వైపు చూడం లేదు.

ఇక పార్టీలో ఉండి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు కుడి బుజంగా ఉంటున్న ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఈ మహానాడు వేడుకకు రాకపోవడం చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ఒక సినిమాను బాలయ్య చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటం వల్ల మహానాడుకు రాలేక పోతున్నట్లుగా బాలయ్య సందేశం పంపించాడట. పూరి సినిమా కంటే మహానాడు చాలా ముఖ్యం. కాని ఎందుకు బాలయ్య మహానాడుకు దూరంగా ఉన్నాడు అనే విషయం ప్రస్తుతం తెలుగు తమ్ముళ తలను తినేస్తుంది. ఏది ఏలా ఉన్నా విశాఖలో జరుగుతున్న పసుపు పండగకు నందమూరి ఫ్యామిలీ హాజరు కాక పోవడంతో కాస్త కళ తప్పినట్లుగా ఉందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నాడు.

To Top

Send this to a friend