బిగ్ బాస్ హౌస్ ఎక్కడుందంటే..?

బిగ్ బాస్ హౌస్ నుంచి గురువారం ముమైత్ ఖాన్ సడన్ గా బయటకు వచ్చింది. ఎక్కడికో వెళ్లి శుక్రవారం రాత్రి వచ్చేసింది. ఈ ఒక్కరోజులో ఎటు పోయింది అంటే హైదరాబాద్ లో డ్రగ్స్ విచారణ కోసం వచ్చేసింది. ఆ విచారణ బుధవారం జరిగింది. అంటే ఒక్కరోజు తేడాతో బిగ్ బాస్ ప్రోగ్రాం మనం చూస్తున్నామన్న మాట. బిగ్ బాస్ హౌస్ లో బుధవారం జరిగిన షోను మనకు గురువారం ప్రసారం చేస్తున్నారన్నమాట..

రోజుకో ట్విస్ట్ తో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ షో అందరినీ అలరిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ షోలో పాల్గొనే వారందరూ తెలుగు సెలబ్రెటీలు కావడం.. పైగా తెలుగు చానల్ మాటీవీలో ప్రసారం అవుతుండడంతో ఈ షో హైదరాబాద్ లోనే
కొనసాగుతోందని అంతా భావించారు. కానీ ఇది తప్పు.. బిగ్ బాస్ షో హైదరాబాద్ లో జరగడం లేదు..

ఈ బిగ్ బాస్ హౌస్ ఎక్కడ ఉందని ఆరా తీస్తే పుణెలో అని తేలింది. ఇదివరకు బాలీవుడ్ బిగ్ బాస్ షో చేసిన సెట్ లోనే తెలుగు సెలబ్రెటీలను పెట్టి షో కానిచ్చేస్తున్నారు. తమిళనాడు బిగ్ బాస్ కార్యక్రమం చైన్నై-బెంగళూరు హైవే పక్కన సెట్ వేసి చేస్తుండగా.. తెలుగు షోను మాత్రం ఫుణెలో నిర్వహిస్తుండడం విశేషం. బిగ్ బాస్ హౌస్ లో రోజు వర్షం పడుతోంది. కానీ హైదరాబాద్ లో పడడం లేదు. అక్కడి నుంచే ముమైత్ ను ఓ రోజు డ్రగ్స్ కేసులో విచారణ కోసం హైదరాబాద్ కు ఫుణె నుంచి విమానంలో తీసుకొచ్చి మళ్లీ అక్కడికి తీసుకుపోయి హౌస్ లో చేర్చారు. అదీ విషయం..

To Top

Send this to a friend