వాట్సప్ లేని స్మార్ట్ఫోన్లు లేవంటే అతిశయోక్తి కాదేమో. చాలామంది వాట్సప్ వాడుతుంటారు కానీ, అందులో ఉన్న ఫీచర్స్ గురించి ఎక్కువ పట్టించుకోరు. వాట్సప్‌ను కూడా హ్యాకర్లు టార్గెట్ చేసిన నేపథ్యంలో వాట్సప్ తీసుకొచ్చిన ఓ కొత్త సెక్యురిటీ ఫీచరే టూ స్టెప్ వెరిఫికేషన్. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే మన వాట్సప్‌ను హ్యాకర్ల భారీ నుంచి రక్షించుకోవచ్చు.
‘టూ స్టెప్ వెరిఫికేషన్’ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే..
వాట్సప్ ఓపెన్ చేశాక పై భాగంలో కుడివైపున ఉన్న మూడు చుక్కల వద్ద ప్రెస్ చేయాలి. అందులో సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. తర్వాత అకౌంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ‘టూ స్టెప్ వెరిఫికేషన్’ అనే ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయాలంటే ఆరు అంకెల పిన్ను సెట్ చేసుకోవాలి. పిన్ను రెండు సార్లు ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడీ కూడా రెండు సార్లు ఎంటర్ చేయాలి. ఈ మెయిల్ ఐడీ ఇవ్వకుండా స్కిప్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. ఈమెయిల్ ఐడీ ఇస్తే మనం ఎప్పుడైనా పిన్ మర్చిపోయినా మెయిల్ ద్వారా రికవరీ చేసుకోవచ్చు. ‘టూ స్టెప్ వెరిఫికేషన్’ ఎనేబుల్ అవుతుంది. ఈ ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకొనే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన పిన్, మెయిల్ ఐడీలను మార్చుకునే సదుపాయం కూడా ఉంది. వాట్సప్‌కు వంద శాతం సెక్యురిటీ కావాలనుకునే వారు ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది..
