వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్లు

వాట్సాప్ ఇప్పుడది అందరికీ నిత్యావసరం.. అందులో ఎన్నో గ్రూపులు, పర్సనల్ చాట్ లు.. ఎన్నో చర్చలు.. ఇప్పుడు ఈ వాట్సాప్ వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఫీచర్లతో అప్ డేట్స్ ను తీసుకొచ్చింది. అదిరిపోయే ఈ ఫీచర్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ తాజా అప్ డేట్ ను అమెరికా, యూరప్ లోని వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియాలో త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

ఇన్నాళ్లు వాట్సాప్ లో ఎక్కువ ఎంబీ ఉన్న ఫైళ్లను పంపుకునేందుకు వీలుండేది కాదు.. ముఖ్యంగా పీడీఎఫ్ ఫైల్స్ పంపుకునేందుకు మాత్రమే పరిమితి ఉండేది. ఇప్పుడు ఇతర ఏ ఫార్మాట్ అయినా , జిప్ ఫైళ్లను అయినా 100 ఎంబీ వరకు సైజ్ ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు ఇక నుంచి మనం టైప్ చేసే టెక్స్ట్ విషయంలో కూడా బోల్డ్, ఇటాలిక్ ఆప్షన్ డైరెక్ట్ గా లేకుండేది. కానీ ఇప్పుడు టైప్ చేయగానే బోల్డ్ , ఇటాలిక్ ఫాంట్స్ తో చేసేలా తాజా అప్ డేట్ ను వాట్సాప్ తీసుకొచ్చింది.

వాట్సాప్ లలో ఇంతవరకు 20ఎంబీ వీడియోలు,ఫొటోలు మాత్రమే పంపుకునే వీలుండేది.. ఇప్పుడు వినియోగదారుల కోరిక మేరకు ఆ పరిమితిని పెంచింది. ఇప్పుడు వాట్సాప్ లలో 100 ఎంబీ వరకు పంపించుకునే వెసులుబాటును కల్పించింది. దాంతో పాటు ఫొటో వాట్సాప్ లలో పంపిస్తే తక్కువ ఎంబీ ,రిజల్యూషన్ తో వెళ్లేవి. ఆ ఫొటో సైజు తగ్గేది. ఈ సమస్యను పరిష్కరించి ఎంత క్వాలిటీ పిక్చర్ అయినా దాని పరిమాణాన్ని తగ్గించకుండా అదే ఫొటోను పంపేలా వాట్సాప్ సరికొత్త అప్ డేట్ ను ప్రవేశపెట్టింది.

To Top

Send this to a friend