ఫేస్ బుక్, వాట్సాప్ లలో మనమే ముందు..

పుట్టింది అమెరికాలోనైనా.. దాన్ని పెంచింది మనమే.. ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అమెరికాను తలదన్ని భారతీయులు అత్యధిక మంది ఫేస్ బుక్ వాడుతున్నట్టు ఆ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు అమెరికాలో 24 కోట్ల మంది ఫేస్ బుక్ ను వాడుతున్నట్టు తెలిపింది. దాన్ని తలదన్ని భారతీయులు 24.1 కోట్ల మంది ఫేస్ బుక్ ఖాతాదారులు అయ్యారని.. అమెరికా కన్నా భారత్ లోనే తమకు ఎక్కువ సంఖ్యలో ఖాతాదారులున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక వాట్సాప్ వాడకం దారుల్లో కూడా ఇండియన్సే ముందున్నారని ఫేస్ బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రపంచంలో సోషల్‌మీడియా వాడుతున్న వాళ్లలో భారతీయులు అగ్రభాగాన ఉన్నారు. ఫేస్‌బుక్ తాజాగా విడుదల చేసిన జాబితాలో తమ యూజర్లు ఎక్కువమంది భారతీయులేనని పేర్కొన్న విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ అనుబంధ మాధ్యమం అయిన వాట్సప్‌ను కూడా భారతీయులు అత్యధికంగా ఉపయోగిస్తున్నారు.

To Top

Send this to a friend