భరత్ మరణం వెనుక  ఆ 7 గంటలు..

 

హీరో రవితేజ సోదరుడు భరత్ ప్రమాదవశాత్తు మరణించడం రెండు రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. అసలు భరత్ మరణానికి ముందు ఏం చేశాడు..? ఎక్కడున్నాడు.. భరత్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు రాకపోవడానికి కారణం ఏంటనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.  కారు ప్రమాదానికి ముందు భరత్ నోవాటెల్ హోటల్ లో పార్టీ చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.  భరత్ తో పాటు రాజు అనే వ్యక్తి ఉన్నట్టు తెలిసింది. భరత్ కారు మధ్యాహ్నం 2.30 కి నోవాటెల్ హోటల్ కి వచ్చిందని.. రాత్రి 9.30 కి వెళ్లినట్టు హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ లో ఉంది. భరత్ -రాజు కలిసి హోటల్ లో రూమ్ తీసుకున్నట్టు ఉంది.

భరత్ అతిగా మద్యం తాగి కారు నడిపి యాక్సిడెంట్ చేశాడని విచారణలో వెల్లడైంది.  భరత్ నోవాటెల్ హోటల్ లో  ఉన్న ఆ 7 గంటలు మద్యంతో పాటు డ్రగ్స్ తీసుకున్నాడా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ఇప్పుడు దాన్ని తవ్వి తీసే పనిలోనే పోలీసులు ఉన్నట్టు తెలిసింది.

భరత్ అంత్యక్రియలకు కుటుంబం రాకపోవడానికి ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ఏమైనా కారణాలున్నాయా అనే విషయంపైన కూడా పోలీసులు ఆరాతీస్తున్నట్టు తెలిసింది. ఇది ప్రమాదమా లేక కావాలని చేసిందా అనే దానిపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా భరత్ మరణానికి ముందు ఆ 7 గంటలు ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

To Top

Send this to a friend