‘మగధీర’ కాపీ చిత్ర ఫలితం ఏంటి?


రామ్‌చరణ్‌, రాజమౌళిల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మగధీర’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా సృష్టించిన రికార్డులను చాలా ఏళ్ల వరకు ఏ సినిమా కూడా దాటలేక పోయింది. ఆ సినిమా కథను పోలి బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘రాబ్తా’. సుషాంత్‌ రాజ్‌పుత్‌ హీరోగా కృతి సనన్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘రాబ్తా’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు పలు విమర్శలు ఎదుర్కొన్న ఆ సినిమా విడుదల తర్వాత కూడా పెద్దగా ఫలితాన్ని పొందడంలో విఫలం అయ్యింది.

‘రాబ్తా’ చిత్రంపై అల్లు అరవింద్‌ కాపీ రైట్‌ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే విడుదల సమయంలో అల్లు అరవింద్‌ తన కేసును ఉపసంహరించుకున్నాడు. ‘రాబ్తా’ చిత్ర యూనిట్‌ సభ్యులు అల్లు అరవింద్‌పై రివన్స్‌ ఎటాక్‌ అవ్వడంతో మెగా నిర్మాత వెనక్కు తగ్గక తప్పలేదు. దాంతో ‘రాబ్తా’ చిత్రం ఎలా ఉంటుందనే ఆసక్తి తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ను తెచ్చుకుంది.

కథ బాగున్నా, కథనం బాగాలేదనే టాక్‌ వస్తుంది. హీరో హీరోయిన్స్‌ మద్య రొమాన్స్‌ ఎక్కువ అయ్యింది. అయితే ఆ రొమాన్స్‌ సందర్బానుసారంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ‘మగధీర’పై గెలిచి నిలిచిన రాబ్తా చిత్రాన్ని ప్రేక్షకులు ఓడివ్వడం జరిగింది.

To Top

Send this to a friend