నటి తులసి ఇటీవలే ‘శంకరాభరణం’ పేరుతో అవార్డులను ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ అవార్డు వేడుకల్లో ఎన్టీఆర్ పాల్గొంటాడని మొదట ప్రచారం జరిగింది. స్వయంగా తులసితో తాను హాజరు అవుతానమ్మా అంటూ ఎన్టీఆర్ చెప్పాడు. కాని చివరి నిమిషంలో అవార్డు వేడుకలో ఎన్టీఆర్ కనిపించలేదు. వస్తాను అన్న ఎన్టీఆర్తో పాటు ఇంకా పలువురు నటీ నటులు ఎందుకు రాలేదు అని ఆమె వాకబు చేయగా మా అధ్యక్షుడు శివాజీ రాజా వారిని అడ్డుకున్నట్లుగా ఆమెకు తెలిసిందట.
తాజాగా ట్విట్టర్ ద్వారా ఆ విషయంపై స్పందిస్తూ మా అధ్యక్షుడు అవ్వగానే తాను గొప్ప అని శివాజీ రాజా భావిస్తున్నాడు. నేను నీకంటే సీనియర్ను అనే విషయాన్ని గుర్తుంచుకో. పదవి అనేది శాస్వతం కాదు నీకు ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని మసులు కోవాలని అంది. శివాజీ రాజా ఒక జోకర్ అని కూడా తుసి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను నిర్వహించిన అవార్డు వేడుకకు ఎన్టీఆర్తో పాటు ఇతర సెలబ్రెటీలను రాకుండా అడ్డుకున్నాడు అని, తాను అంటే పడని ఒక వ్యక్తితో కలిసి శివాజీ రాజా ఇలా చేశాడు అని ఆమె పేర్కొంది. ఇంతకు తులసితో మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజాకు ఏంటి వివాదం అనేది తెలియాల్సి ఉంది.
