రవితేజ, పూరి జగన్నాథ్ అరెస్ట్ అయితే..

ప్రముఖ హీరో రవితేజ, దర్శకుడు పూరి జగన్నాథ్ లకు ముప్పు పొంచి ఉంది. వారు అరెస్ట్ అవుతారా.? లేదా విచారణకు సహకరిస్తారా అన్న ఉత్కంఠ తెలుగు సినీ ఇండస్ట్రీని ఊపేస్తోంది.. తెలుగు సినీ ప్రముఖులకు డ్రగ్ స్మగ్లర్ కేసులో సంబంధం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు ఇప్పుడు ఈనెల 19నుంచి వారిని విచారించనున్నారు. పూరి జగన్నాత్ ను ఈనెల 19న డ్రగ్స్ కేసును పర్యవేక్షిస్తున్న సిట్ ముందుకు రావాలని ఆదేశించారు. హీరో రవితేజను 22న గానీ, 28న గానీ ఆయన డ్రైవర్ శ్రీనివాసరాజుతో కలిసి రావాలని ఆదేశించారు. ఇక 22న తరుణ్ , 28న చార్మి లను రావాలని కోరారు. మిగతా సినీ ప్రముఖులకు కూడా నోటీసుల్లో తేదీలను చెప్పి విచారణకు రమ్మన్నారు.

డ్రగ్స్ కేసులో ఈ సినీ ప్రముఖులకు సంబంధం ఉన్నట్టు తేలితే వారి అరెస్టులు తప్పవు. ఈ నేపథ్యంలో హీరో రవితేజ, దర్శకుడు పూరి జగన్నాథ్ ల భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకుంటాయి. ప్రస్తుతం రవితేజ కొత్త దర్శకులతో సినిమాలు తీస్తున్నారు. అవన్నీ షూటింగ్ లో ఉన్నాయి. ఇక పూరి .. బాలక్రిష్ణ హీరోగా పైసా వసూల్ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక వేళ పూరిని, రవితేజను పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ సినిమాలు ఆగిపోవడంతోపాటు తెలుగు ఇండస్ట్రీపైనే మాయని మచ్చ పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఈ నెలాఖరులో ఈ సినీ ప్రముఖులకు ఏమవుతుందోనన్న టెన్షన్ అయితే సర్వత్రా ఉంది.

డ్రగ్స్ కేసులో చెలరేగండని కేసీఆర్ ఆదేశించడంతో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ దూకుడు పెంచారు. ఈ నెల 19 నుంచి తమ వద్దకు విచారణకు రావాలని సినీ ప్రముఖులను ఆదేశించారు.. సంబంధం ఉన్న ఎవ్వరినీ వదలొద్దు కేసీఆర్ స్పష్టం చేయడంతో సినీ ప్రముఖుల అరెస్ట్ తప్పదా అన్న ఉత్కంఠ నెలకొంది.

To Top

Send this to a friend