తనవాడిని తనవారికి పరిచయం చేయాలని..!


నాగచైతన్య, సమంతలు అక్టోబర్‌లో వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయినా కూడా మళ్లీ మళ్లీ వీరి కాంబో మూవీస్‌ కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తాజాగా నాగచైతన్య ఆ విషయమై స్పందిస్తూ ఒక రొమాంటిక్‌ లవ్‌స్టోరీని సమంతతో చేయాలని తనకు ఉందని చెప్పుకొచ్చాడు. అయితే దానికి కాస్త సమయం పడుతుందని మాత్రం చెప్పుకొచ్చాడు. అదే విషయమై సమంత ఒక ఆశ్చర్యకర విషయాన్ని చెప్పుకొచ్చింది.

తమిళనాడులో జరిగిన ఒక ప్రైవేట్‌ వేడుకలో సమంత పాల్గొంది. ఆ సందర్బంగానే తనకు కాబోయే భర్తతో వచ్చే సంవత్సరంలో ఒక తమిళ సినిమాను చేస్తాను అంటూ ప్రకటించింది. సమంత తమిళనాడుకు చెందిన హీరోయిన్‌. చెన్నై ముద్దుగుమ్మగా పేరున్న సమంత కోలీవుడ్‌లో ఇప్పటికే పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా స్టార్‌ హీరోయిన్‌గా ఈ అమ్మడు దూసుకు పోతుంది. ఈ సమయంలోనే ఈ అమ్మడు చైతూను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావిస్తుంది. తమిళంలో ఒక సినిమాను ఈ అమ్మడు చైతూతో కలిసి చేయాలనే అభిప్రాయంతో ఉంది. అందుకు చైతూ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తుంది. దాంతో పాటు ఓంకార్‌ దర్శకత్వంలో ‘రాజుగారి గది 2’ చిత్రాన్ని చేసింది. ఆ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. మరో చిన్న చిత్రంలో గెస్ట్‌ రోల్‌ను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు తమిళంలో కూడా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. అక్టోబర్‌లో పెళ్లి ఉన్న కారణంగా సినిమాలు అప్పటి వరకు పూర్తి చేసే ఉద్దేశ్యంతో సమంత చకచక షూటింగ్‌లో పాల్గొంటుంది.

To Top

Send this to a friend