ఈ ఒక్క ఆలోచన ఎందరికో వెలుగునిచ్చింది..

ఆ ఒక్క ఆలోచన ఎందరికో వెలుగునిచ్చింది. ఎంతో మంది గుడ్డ లేని అభాగ్యులకు ఆసరా ఇచ్చింది. స్కూలు బ్యాగులు లేని వారికి భరోసానిచ్చింది..ఎండకు ఎండి వానకు తడిచే నిర్భాగ్యులకు మనోధైర్యాన్నిచ్చింది. మన పాత వస్తువులను అక్కడ పెట్టి కావాల్సినవి తీసుకుపోయే ఆ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా సేవతత్పరతలో ఆదర్శంగా నిలుస్తోంది. ఆ ‘వాల్ ఆఫ్ కైండ్ నెస్’ ఓ ఉద్యమంలా సాగుతోంది. ఇంతకీ ఎంటా కార్యక్రమం.. ఎంత సేవ చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

నిజామాబాద్ జిల్లాలో నివసించే శ్రావణి, శ్రీనివాస్ వైద్య దంపతు లు ‘వాల్ ఆఫ్ కైండ్‌నెస్’ కార్య క్రమానికి శ్రీకారం చుట్టా రు. మీకు ఉపయోగం లేనివి ఇక్కడ వదలండి… మీకు అవసరమైనవి కావాలంటే తీసుకెళ్లండి అంటూ గోడ మీ ద రాసిన వాక్యాలు అందరినీ సేవ వైపు నడిపించేలా చేశాయి. ఈ దంపతులు పదిహేనేళ్లుగా వైద్య వృత్తిలో ఉన్నారు. పేద వారికి సేవచేయాలనే తపన ఇద్దరికీ ఉండేది. డాక్టర్ శ్రావణి వాల్ ఆఫ్ కైండ్‌నెస్ గురించి తెలుసుకున్నారు.

భర్త సహకారంతో నిజామాబాద్‌లోని ఖలీల్ వాడీ సెంటర్‌ను ఎంచుకున్నారు. మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకుని తమ పనిని ప్రారంభించారు. ముందుగా తమ దగ్గరున్న వాడని దుస్తులను అక్కడి గోడకు తగిలించడం మొదలుపెట్టారు. నెమ్మదిగా చుట్టుపక్కల వారు కూడా తమకు ఉపయోగపడని వస్తువులను అక్కడ ఉంచడం మొదలుపెట్టారు. ఎప్పుడూ ఆ గోడ ఖాళీగా ఉండదు. బట్టలు తగిలించి ఉంటాయి. అవసరమైనవి తీసుకునే వారున్నారు. అనవసరంగా ఏదీ ముట్టుకోరు. చిన్నపిల్లల పాత పుస్తకాలు, స్కూలు బ్యాగు లు, చెప్పులు ఇలా ఒకటేమిటి అన్ని రకాల వస్తువులు అక్కడ దర్శనమిస్తున్నాయి. దీని వల్ల ఇచ్చినవారు, తీసుకున్న వారు కూడా సంతోషంగా ఉంటున్నారు. సాయం చేయాలనుకునేవారి కోరిక తీరుతుంది. ఎంత ఖరీదు పెట్టినా కొనలేని తృప్తి దొరుకుతుంది. వానా కాలంలో కప్పుకోడానికి జానెడు బట్టలేని నిర్భాగ్యులకు ఈ గోడ మమకారాన్ని అందిస్తోంది. ఓ వెచ్చని ఆత్మీయ స్పర్శను అందిస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలంటు న్నారు శ్రావణి దంపతులు.

ఈ ఆలోచనకు శ్రీకారం ఎక్కడంటే…
2015లో ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. నిరు ద్యోగం ఎక్కువైంది. అటువంటి పరిస్థితుల్లో కట్టుకోవడా నికి బట్టలు కూడా లేక దారిద్య్రాన్ని అనుభవించవారు ఎందరో. అక్కడ కొంతమంది యువకులకు వచ్చిన ఆలో చనే ‘నేకీ కి దీవార్’. స్వచ్ఛందంగా విరాళాలివ్వాల ని ఈ కొత్త ఆలోచనను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించారు. స్పందించిన నెటిజన్లు తమ వంతు సాయం అందించా రు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం వ్యాప్తిలోకి వచ్చింది. ఇరాన్‌ను ఆదర్శంగా తీసుకున్న పాకిస్తాన్ కూడా నేకీ కీ దీవార్‌ను ప్రారంభించి విజయబాటలో నడుస్తోంది. ఇలా క్రమంగా భారతదేశానికి కూడా వచ్చి చేరింది. కులమతాలకు అతీతంగా అందరూ మంచి చేయడానికి ముందుంటారనే విషయాన్ని రుజువుచేశారు ప్రజలు.

*భారతదేశంలో…
ఇరాన్ తర్వాత ఉత్తర భారతదేశంలో జైపూర్, అలహా బాద్, డెహ్రాడూన్, భోపాల్, చండీఘర్, ఢిల్లీ, నోయిడా, లుథియానా లాంటి చోట్ల సాయం చేసే గోడలు వెలిశాయి. భోపాల్‌లో మహేష్ అగర్వాల్ నెక్కీకీ దీవార్ పేరుతో సేవలందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని గోడలను తయారుచేయాలనే ఆలోచనతో ఉన్నాడాయన. జనసంచారం ఎక్కువగా ఉన్నచోట, కమ్యూనిటీ హాళ్ల దగ్గర, పబ్లిక్ ప్లేసుల్లో వాల్‌ఆఫ్‌కైండ్‌నెస్ ఏర్పాటు చేస్తున్నారు. గోడలకు అందమైన పెయింటింగ్ వేసి, మీకు అవసరం లేకుంటే ఇచ్చేయండి… అవసరం ఉంటే హ్యాపీగా తీసుకెళ్లండి అంటూ కొటేషన్స్ కనిపిస్తాయి.

*నిజామాబాద్ బాటలో హైదరాబాద్ …
ఇంత పెద్ద సిటీలో ఎవరికి ఎలా దానం చేయాలో తెలీదు. అందుకే నగర జీహెచ్‌ఎంసీ ఒక ఫ్లాట్‌ఫాంను ఏర్పాటుచేసింది. సగం వాడేసి మనకు అవసరం లేని వస్తువులను ఇక్కడ మనం దానం చేయొచ్చు. పుస్తకాలు, బట్టలు, చెప్పులు ఇలా ఇంట్లో ఉన్న పాత వస్తువులను గోడ దగ్గర పెట్టాలి. అవసరమున్న వాళ్లు వచ్చి తమకు కావాల్సినవి తీసుకెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ జూనియర్ కాలేజ్ కాంపౌండ్ గోడకు రంగులు వేసి వాల్ ఆఫ్ కైండ్‌నెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు అధికారులు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. సిటీలో ఉన్న మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి గోడలను ఏర్పాటుచేసే పనిలో ఉన్నారు అధికారులు. వర్షాకాలంలో ఈ కార్యక్రమానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి దీన్ని ఆఫీసులోని కాంపౌండ్‌లో మార్చనున్నారు.

*నిరంతర ప్రక్రియ…
అందంగా పెయింట్ వేసిన చిన్న గోడ, దానికి కొన్ని హ్యాంగర్లు ఉంటేచాలు. దానం ఇచ్చేవాళ్లు ఇస్తారు. అవసరం ఉన్నవారు తీసుకెళ్తారు. వస్తువులు, బట్టలు వస్తూనే ఉంటాయి..పోతూనే ఉంటాయి ఇది నిరంతర ప్రక్రియ. దీని వల్ల గోడ మీద పిచ్చి రాతలు, సినిమా వాల్‌పోస్టర్లు, మూత్రవిసర్జనలు పూర్తిగా తగ్గాయి. ఒక విధంగా స్వచ్ఛభారత్ ప్రక్రియలో ఒక భాగమైంది. దీంతో వ్యర్థాల ఉత్పత్తి తగ్గడంతోపాటు ఇతరులకు కూడా మేలు జరుగుతుంది.

To Top

Send this to a friend